Thursday, January 23, 2025

మంజీరా నదిలో టోర్నెడోలను తలపించిన దృశ్యం…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: మంజీరా నదిలో టోర్నెడోలను తలపించిన దృశ్యం కనిపించింది. ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. అంతలోనే అనూహ్యంగా మంజీరా నదిలో సుడిగాలి రేగింది. గింగిరాలు తిరుగుతూ ఆకాశం నుంచి నదిలోకి తెల్లని ధారలా ఏర్పడింది. సుమారు రెండు నిమిషాలసేపు నీరు నింగివైపు ఎగసింది. అటుగా వెళ్లిన వారంతా ఆ క్రమాన్ని ఆశ్చర్యంగా తిలకించారు. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం నిర్జిపల గ్రామ శివారులోని సింగూరు ప్రాజెక్టులో అద్భుత దృశ్యం కనువిందు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News