Thursday, February 20, 2025

బొల్తాపడిన విమానం… 18 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

టొరంటో: కెనడాలోని టొరంటో పియర్‌సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం ల్యాంగ్ అయిన వెంటనే అదుపు తప్పి బొల్తాపడడంతో 18 మంది గాయపడ్డారు. వెంటనే వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అమెరికాలోని మిన్నెపొలిస్ నుంచి పియర్‌సన్‌కు వచ్చినప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది, అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News