దేశంలో సుప్రసిద్ధ ఫార్మా బ్రాండ్లలో ఒకటైన టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఇటీవలనే తమ మొట్టమొదటి, 12 వారాల పాటు జరిగే సుదీర్ఘమైన ప్రచారాన్ని టీవీ, డిజిటల్ మీడియా కోసం విడుదల చేసింది. ఈ ప్రచారం, ‘బీషెల్‌కాల్ స్ట్రాంగ్’ద్వారా ఈ ఫార్మా సంస్థ తమ బ్రాండ్ షెల్కాల్ 500 మార్కెట్ లీడర్‌గా వెలుగొందడం చెప్పడంతో పాటుగా డాక్టర్లు సూచించిన నెంబర్ 1 కాల్షియం సప్లిమెంట్ – ఓవర్ ద కౌంటర్ (ఓటీసీ) కాల్షియం సప్లిమెంట్‌గా మారడాన్ని వెల్లడిస్తుంది.
భారతదేశంలో 40% మందికి పైగా కాల్షియం లోపంతో బాధపడుతుంటే, 79% మంది విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నారు. ఈ ప్రచారం ద్వారా ఒకరి జీవితంలో కాల్షియం ఆవశ్యకతను వెల్లడిస్తుంది.
ఈ ప్రచారంలో భాగంగా టోరెంట్ ఫార్మాస్యూటికల్స్, అత్యధికంగా అనుసంధానితమైన కాల్షియం కాలిక్యులేటర్‌ను వెబ్సైట్ , www.shelcal.com పై జోడించింది. ఇది ప్రతి రోజూ తీసుకోవాల్సిన డైటరీ కాల్షియం గురించి వినియోగదారులకు వెల్లడించడంతో పాటుగా కాల్షియం యొక్క 100% ఆర్డీఏ చేరుకోవడం గురించి వెల్లడిస్తుంది. దీనితో పాటుగా వినియోగదారులు టోల్ ఫ్రీ నెంబర్ 1800 2020 240కు కాల్ చేసి తమ కాల్షియం సంబంధిత సందేహాలనూ తీర్చుకోవచ్చు.
బీ షెల్కాల్ స్ట్రాంగ్ టీవీసీ ద్వారా మహిళల్లో కాల్షియం లోపం గురించి వెల్లడించడంతో పాటుగా తమ ఎముకల బాధను వినమని, మరీ ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన మహిళలు ఆప్రమప్తంగా ఉండమని చెబుతుంది.
టొరెంట్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమన్ మెహతా మాట్లాడుతూ ‘‘ఓటీసీలోకి షెల్కాల్ ప్రవేశంతో , ఈ బ్రాండ్ ఇప్పుడు అతిపెద్ద కాల్షియం సప్లిమెంట్ బ్రాండ్‌గా భారతదేశంలో నిలువాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీషెల్‌కాల్ స్ట్రాంగ్ అనేది అత్యంత శక్తివంతమైన విలువ ప్రతిపాదనగా నిలువడంతో పాటుగా షెల్కాల్ యొక్క బ్రాండ్ పట్ల అవగాహన కూడా కల్పించనుంది. దీనితో పాటుగా తమ డైట్లో కాల్షియం ఆవశ్యకత కూడా తెలుపుతుంది’’ అని అన్నారు.
టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమల్ కేల్షికర్ మాట్లాడుతూ ‘‘ ఆర్డీఏ సూచించిన 1000ఎంజీ/డే కాల్షియం ను ప్రతి ఇద్దరు భారతీయులలో ఒకరు తీసుకోవడం లేదు. అందువల్ల, షెల్కాల్ 500ను ఓటీసీకి తీసుకువెళ్తూ, సంబంధితమైన , తగిన మరియు ఆకర్షణీయమైన ప్రచారాన్ని తీసుకురావడం ద్వారా ఒకరికి తగినంతగా కాల్షియం ఎంత అవసరమో అవగాహన కల్పిస్తున్నాము’’ అని అన్నారు.