Monday, January 20, 2025

కన్స్యూమర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించిన టోరెంట్‌ ఫార్మా..

- Advertisement -
- Advertisement -

భారతదేశంలో సుప్రసిద్ధ ఫార్మా బ్రాండ్లలో ఒకటైన టోరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ ఇటీవలనే తమ మొట్టమొదటి, 12 వారాల పాటు జరిగే సుదీర్ఘమైన ప్రచారాన్ని టీవీ, డిజిటల్‌ మీడియా కోసం విడుదల చేసింది. ఈ ప్రచారం, ‘బీషెల్‌కాల్‌ స్ట్రాంగ్‌’ ద్వారా ఈ ఫార్మా సంస్థ తమ బ్రాండ్‌ షెల్‌కాల్‌ 500 మార్కెట్‌ లీడర్‌గా వెలుగొందడం గురించి చెప్పడంతో పాటుగా డాక్టర్లు సూచించిన నెంబర్‌ 1 కాల్షియం సప్లిమెంట్‌ – ఓవర్‌ ద కౌంటర్‌ (ఓటీసీ) కాల్షియం సప్లిమెంట్‌గా మారడాన్ని వెల్లడిస్తుంది. ఈ ప్రచారం ద్వారా ఒకరి కాల్షియం అవసరాలను సైతం తీర్చుకోవాల్సిన ఆవశ్యకత పట్ల అవగాహన కల్పిస్తారు.

ఈ ప్రచారంలో భాగంగా టోరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌, అత్యధికంగా అనుసంధానితమైన కాల్షియం కాలిక్యులేటర్‌ను వెబ్‌సైట్‌, www.shelcal.com పై జోడించింది. ఇది ప్రతి రోజూ తీసుకోవాల్సిన డైటరీ కాల్షియం గురించి వినియోగదారులకు వెల్లడించడంతో పాటుగా కాల్షియం యొక్క 100% ఆర్‌డీఏ చేరుకోవడం గురించి వెల్లడిస్తుంది. ఈ విశ్లేషణ ఆధారంగా, వినియోగదారులు పూర్తి సమాచారంతో నిర్ణయాలను తీసుకోవడం సాధ్యమవుతుంది. దీనితో పాటుగా వినియోగదారులు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800 2020 240కు కాల్‌ చేసి తమ కాల్షియం సంబంధిత సందేహాలనూ తీర్చుకోవచ్చు.

బీ షెల్‌కాల్‌ స్ట్రాంగ్‌ టీవీసీ ద్వారా మహిళల్లో కాల్షియం లోపం గురించి వెల్లడించడంతో పాటుగా తమ ఎముకల బాధను వినమని, మరీ ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన మహిళలు ఆప్రమప్తంగా ఉండమని చెబుతుంది. ఇద్దరు స్నేహితులు మార్నింగ్‌ వాక్‌కు వెళ్లే ఉదంతం తీసుకుని ఈ టీవీసీలో ప్రతి రోజూ షెల్‌కాల్‌ 500 ను తమ డైట్‌లో సప్లిమెంట్‌గా తీసుకోవాల్సిన అవసరాన్ని వెల్లడిస్తుంది.

కాల్షియం 500 మిల్లీ గ్రాములు, 250 ఐయు విటమిన్‌ డీ3 కూడిన షెల్‌కాల్‌ కాల్షియం స్వీకరణ పెంచడంతో పాటుగా ఎముకల సాంద్రత వృద్ధి చేసి, మజిల్‌ స్ట్రెంగ్త్‌నూ మెరుగుపరుస్తుంది. దానితో పాటుగా రోగ నిరోధక శక్తి కూడా పెంచడంలో సహాయపడుతుంది. ఈ కాల్షియంను ఓయెస్టర్‌ షెల్స్‌ నుంచి తీసుకోవడం వల్ల శరీరం త్వరగా స్వీకరించగలదు. జీవ లభ్యత కూడా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా, ఆర్‌ఎక్స్‌ విభాగంలో మార్కెట్‌ లీడర్‌గా షెల్‌కాల్‌ 500 వెలుగొందుతుంది. దీని మార్కెట్‌వాటా ప్రస్తుతం 43%గా ఉండటంతో పాటుగా ఇది స్థిరంగా వృద్ధి చెందుతుంది. ఓటీసీకి వెళ్లడంతో షెల్‌కాల్‌ మరింతగా తమ వాటాను కన్స్యూమర్‌ హెల్త్‌కేర్‌ విభాగంలో పెంచుకోనుంది.

టొరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అమన్‌ మెహతా మాట్లాడుతూ ‘‘ఓటీసీలోకి షెల్‌కాల్‌ ప్రవేశంతో, ఈ బ్రాండ్‌ ఇప్పుడు అతిపెద్ద కాల్షియం సప్లిమెంట్‌ బ్రాండ్‌గా భారతదేశంలో నిలువాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రచారం ప్రారంభించడంతో, వినియోగదారులను క్రమం తప్పకుండా కాల్షియం సప్లిమెంట్‌ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తద్వారా వారు తమ డైటరీలోపాలను అధిగమించగలరు. ‘బీషెల్‌కాల్‌ స్ట్రాంగ్‌ ’అనేది అత్యంత శక్తివంతమైన విలువ ప్రతిపాదనగా నిలువడంతో పాటుగా షెల్‌కాల్‌ యొక్క బ్రాండ్‌ పట్ల అవగాహన కూడా కల్పించనుంది. దీనితో పాటుగా తమ డైట్‌లో కాల్షియం ఆవశ్యకత కూడా తెలుపుతుంది’’ అని అన్నారు.

టోరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అమల్‌ కేల్షికర్‌ మాట్లాడుతూ.. ‘‘డాటా వెల్లడించే దాని ప్రకారం, భారతీయులో 40.6% మంది కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. అలాగే 79% మంది విటమిన్‌ డీ లోపంతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆర్‌డీఏ సూచించిన 1000ఎంజీ/డే కాల్షియం ను ప్రతి ఇద్దరు భారతీయులలో ఒకరు తీసుకోవడం లేదు. అందువల్ల, షెల్‌కాల్‌ 500ను ఓటీసీకి తీసుకువెళ్తూ, సంబంధితమైన, తగిన, ఆకర్షణీయమైన ప్రచారాన్ని తీసుకురావడం ద్వారా ఒకరికి తగినంతగా కాల్షియం ఎంత అవసరమో అవగాహన కల్పిస్తున్నాము. వినియోగదారులు మరియు ఆరోగ్యవంతమైన, చురుకైన జీవనశైలి మధ్య అంతరాన్ని తగ్గించడానికి టోరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ చురుగ్గా ప్రయత్నిస్తోంది’’ అని అన్నారు.

నేటి వేగవంతమైన జీవనశైలి కారణంగా చాలామంది తమ ఆహార అలవాట్లు మార్చుకుంటున్నారు. ఫాస్ట్‌ఫుడ్స్‌కు అలవాటు పడుతుండటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడం లేదు. దీని కారణంగా నీరస పడుతున్నారు. నిజానికి కాల్షియం, విటమిన్‌ డీ 3 లోపాలు భారతీయ మహిళల్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని కారణంగా వారు తమ రోజువారీ జీవితంలో తీవ్ర సమస్యలనూ ఎదుర్కొంటున్నారు. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం పుట్టిన సమయంలో శిశువులలో 30 గ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది వయసుతో పాటుగా పెరుగుతుంది. పెద్ద వయసుకు వచ్చేసరికి అది 1400గ్రాములుగా మగవారిలో ఉంటే ఆడవారిలో 1200 గ్రాములుగానే ఉంటుంది.

అయితే ఇది వారు త్వరగా నష్టపోవడమూ జరుగుతుంది. ఈస్ట్రోజెన్‌ తగ్గడం, మెనోపాజ్‌ వంటివి దీనికి కారణాలు. మహిళల ఎముకల పటుత్వానికి కాల్షియం అనివార్యమైనది. దురదృష్టవశాత్తు వారు తగినంతగా కాల్షియం తీసుకోవడం లేదు. డైటరీ కాల్షియంకు తగిన ప్రాప్యతను అందించడానికి షెల్‌కాల్‌ 500–మూడు దశాబ్దాలుగా వినియోగదారులు, నిపుణుల చేత అత్యంత నమ్మకమైన బ్రాండ్‌గా నిలిచింది. డాక్టర్లు సూచించిన ఈ బ్రాండ్‌ ఇప్పుడు ఓటీసీగా భారతదేశమంతటా టొరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ తీసుకువచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News