Wednesday, January 22, 2025

సంగారెడ్డిలో కుండపోత వాన

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: జిల్లా కేంద్రమైన సంగారెడ్డితోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం కుండపోత వాన కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన రావడంతో జనం బెంబలెత్తి పోయారు. పెద్ద ఎత్తున గాలులు వేయడంతో చాలాచోట్ల ప్లెక్సీలు బోర్డులు ఎగిరిపోయాయి. అక్కడక్కడ ఇంటి పైకప్పులు కూడా పడిపోయినట్టు తెలుస్తుంది ఇక భారీ వాన రావడంతో మురుగు నీరంతా రోడ్లపైకి చేరింది. దీంతో రోడ్లన్నీ జలాశయాలను తలపించాయి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో జనం అల్లాడిపోయారు. చిన్న గాలివానకే కరెంటు పోవడం సంగారెడ్డిలో పరిపాటిగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News