Thursday, January 9, 2025

చెట్టుకు కట్టేసి చిత్రహింసలు..యుపిలో దారుణం(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

బారాబంకి: ఉత్తర్ ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా ఖాసపరియా గ్రామంలో ఇద్దరు మైనర్ ముస్లిం బాలలను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితులలో ఒక తండ్రి, అతని ఇద్దరు కుమారులు ఉన్నారు. బాధఙతులు షాదాబ్, షకీల్ జనవరి 29న తమ మేకలకు దాణా సేకరించేందుకు గ్రామానికి వెళ్లినపుడు ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

తమ ఇంటికి తిరిగివస్తున్న ఆఇద్దరు బాలలను అడ్డుకున్న త్రిలోకి, అతని ఇద్దరు కుమారులు సోను, సూరజ్ వారిని చెట్టుకు కట్టేసి కర్రలతో చితకబాదారని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఇద్దరు పిల్లలను రక్షించిన స్థానికులు వారి తండ్రి మజ్‌బుల్లా ఈ విషయం తెలియచేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న బజ్‌బుల్లా తన పిల్లలను ఇంటికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రిలోకి, అతని ఇద్దరు కుమారులపై పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News