Thursday, January 23, 2025

రాష్ట్రంలో బ్యాంకుల మొత్తం డిపాజిట్లు రూ.6,03,548 కోట్లు

- Advertisement -
- Advertisement -

మొత్తం అడ్వాన్స్‌లలో 3.81 శాతం వృద్ధి
ఎంఎస్‌ఎంఇలకు రూ.32,210 కోట్లు మంజూరు
ఎస్‌ఎల్‌బిసి 32వ త్రైమాసిక సమీక్షలో అమిత్ జింగ్రాన్ వెల్లడి

Total deposits of banks are Rs 603548 crore in state
మన తెలంగాణ/ హైదరాబాద్ : గతేడాది(2021) డిసెంబర్ ముగింపు నాటి త్రైమాసికంలో బ్యాంకుల మొత్తం డిపాజిట్లు రూ.6,03,548 కోట్లు నమోదయ్యాయి. ఈమేరకు ఎస్‌ఎల్‌బిసి (స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ) అధ్యక్షుడు, ఎస్‌బిఐ సిజిఎం అమిత్ జింగ్రాన్ వెల్లడించారు. మంగళవారం ఎస్‌ఎల్‌బిసి తెలంగాణకు చెందిన 32 త్రైమాసిక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జింగ్రాన్ తెలంగాణ బ్యాంకుల పనితీరుకు సంబంధించిన ప్రజెంటేషన్ ఇచ్చారు. 2021 డిసెంబర్ 31 ముగింపు నాటికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బ్యాంకుల డిపాజిట్లు రూ.రూ.6.03 లక్షల కోట్లు నమోదయ్యాయి.

మొత్తం అడ్వాన్స్‌లు రూ.25,889 కోట్లు (3.81 శాతం) పెరిగి రూ.7.06 లక్షల కోట్లకు చేరాయి. సిడి నిష్పత్తి 110 శాతం నుంచి 117 శాతానికి పెరిగింది. స్వల్పకాలిక వ్యవసాయ ఉత్పత్తి రుణాల పంపిణీ 53 శాతం వృద్ధితో రూ.31,489 కోట్లు నమోదు చేసింది. వ్యవసాయ టర్మ్ లోన్లు రూ.11,709 కోట్లు నమోదయ్యాయి. విద్యా రుణాలు రూ.610 కోట్లు, గృహ రుణాలు రూ.3,259 కోట్లు నమోదైనాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఇ) బ్యాంకులు రూ.32,210 కోట్లు మంజూరు చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం టార్గెట్‌లో రూ.81.83 శాతం సాధించాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎనర్జీ, హౌసింగ్) సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News