Sunday, December 22, 2024

కుటుంబం లోని మొత్తం నలుగురు అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

Total of four members of family died suspiciously

 

చెన్నై : తమిళనాడు లోని పెరుంగుడి అపార్టుమెంట్ కాంప్లెక్సులో ఒక కుటుంబం లోని మొత్తం నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తల్లీదండ్రితోపాటు పదకొండేళ్ల అబ్బాయి, ఏడాది పాప కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం కలిగించింది. కుటుంబ యజమాని రామాపురంలో ప్రయివేట్ సంస్థలో పనిచేస్తున్న 38 ఏళ్ల మణికందన్ గా పోలీసులు గుర్తించారు. మణికందన్ కోపంతో క్రికెట్ బ్యాట్‌తో భార్య తారను చావ మోదాడని, ఆ తరువాత తన ఇద్దరు పిల్లలను హత్య చేశాడని, ఆ తరువాత తాను వంటగదిలో తనకు తానే ఉరిపోసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తార తలకు తీవ్ర గాయాలు కనిపించగా, ఇద్దరు పిల్లలు ఊపిరాడక చనిపోయినట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఇరుగుపొరుగు వారిని, మణికందన్ సహోద్యోగులను పోలీసులు విచారించగా కొన్ని వివరాలు తెలిసాయి. మణికందన్ తన స్నేహితుల నుంచి అప్పుచేశాడని, పనికి కూడా సరిగ్గా వెళ్లే వాడు కాదని తెలిసింది. ఇంటివద్ద తన కంప్యూటర్ వద్దనే ఎక్కువ సమయం గడిపేవాడని సహోద్యోగులు చెప్పారు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు ఎక్కువగా బానిస కావడంతో భార్యకు, తనకు తరచుగా గొడవలు జరుగుతుండేవని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News