సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాల్లో కనిపించే ఈ సంపూర్ణ సూర్య గ్రహణం భారతదేశంలో మాత్రం కనిపించదు. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు అడ్డంగా రావడంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంటే గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖపై ఉంటాయన్నమాట. గ్రహణ సమయంలో సూర్యుణ్ని నేరుగా చూడకూడదని, బైనాక్యులర్స్, టెలిస్కోప్ వంటి సాధనాల ద్వారా మాత్రమే చూడాలని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు.
ఏప్రిల్ 8వ తేదీ మధ్యాహ్నం 2.12 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమై ఏప్రిల్ 9వ తేదీ తెల్లవారుజామున 2.22 గంటలకు ముగుస్తుంది. గ్రహణం వీడినప్పుడు, అంటే.. చంద్రుడు ముందుకు కదిలిన క్షణంలో అంతరిక్షంలో “డైమండ్ రింగ్” ఆవిష్కృతమవుతుంది. నార్త్ అమెరికాలో మళ్లీ 375 ఏళ్లకే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 1842లో యూరప్ లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. భారతదేశంలో 1982 లో సంపూర్ణ సూర్యగ్రహణం దర్శన మిచ్చింది.