Wednesday, January 22, 2025

‘బూట్స్’ డీల్ కోసం అంబానీకి గట్టిపోటీ

- Advertisement -
- Advertisement -

Tough competition for Ambani for 'Boots' deal

లండన్: ఇకామర్స్‌రంగంలో పట్టుకోసం వేగంగా అడుగులు వేస్తున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి బ్రిటన్‌కు చెందిన డ్రగ్స్ స్టోర్స్ టేకోవర్‌పై గట్టిపోటీ ఎదురవుతోంది. గుజరాత్ సంతతికి చెందిన ఇద్దరు బ్రిటన్ సోదరులు(ఈషా బ్రదర్స్) ముకేశ్‌కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న డ్రగ్స్ స్టోర్..బూట్స్ విక్రయానికి దాని యాజమాన్య సంస్థ వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయెన్స్ బిడ్స్ ఆహ్వానించింది. ముందుగా చేసిన ప్రకటన ప్రకారం ఈ నెల 16తో గడువు ముగిసినా దాన్ని పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాల్‌గ్రీన్స్ బూట్స్ యాజమాన్యం 8.5 బిలియన్ డాలర్లకు ( రూ.65,865 కోట్లు) బిడ్స్ ఆహ్వానించింది. కాగా తమ ఆకాంక్షలకు అనుగుణంగా బూట్స్ డీల్ ఉందని ఈషా బ్రదర్స్ భావిస్తున్నారు. ఈషా బ్రదర్స్ ఇంతకంటే ఎక్కువ బిడ్ ఆఫర్ చేశారని సమాచారం.

ఈ డీల్ పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద టేకోవర్ డీల్‌అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈషా బ్రదర్స్ మూలాలు భారత్‌నుంచి బ్రిటన్‌కు వలస వెళ్లి స్థిరపడిన గుజరాతీ ముస్లింలు బారుచ్‌లవని తెలుస్తోంది. మోహిసిన్ ఈషా, జుబేర్ ఈషా ప్రస్తుతం యూరప్‌లోనే అతిపెద్ద పెట్రోల్ పంప్ కంపెనీ యూరోగ్యారేజెస్ నడుపుతున్నారు. బ్రిటీష్ సూపర్ మార్కెట్ చైన్ కంపెనీ ఆస్డా, రెస్టారెంట్ చైన్ కంపెనీ ఇయాన్ కలిగి ఉన్నారు. అచ్చు ముకేశ్ అంబానీ తరహాలోనే టేకోవర్‌ల ద్వారా తమ వ్యాపార సామ్రాజ్యాన్నివిస్తరించాలని ఈషా బ్రదర్స్ తహతహలాడుతున్నారు. అందుకోసం బూట్స్ డ్రగ్స్ సోర్స్ స్వాధీనంపై ఎట్టిపరిస్థితుల్లోను వెనక్కి తగ్గరాదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ డీల్ పూర్తయితే అవసరమైన నిధుల కోసం ఆస్డా పేరుతో రుణాలు సేకరించడం కొన్ని సంస్థల ఆస్తులు విక్రయించాలని భావిసున్నారని సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News