Monday, December 23, 2024

రూరల్‌లో అసిస్టెంట్ కలెక్టర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం, పోలేపల్లి గ్రామాల్లో అసిస్టెంట్ కలెక్టర్ స్నేహలత గురువారం పర్యటించారు. తొలుత ఏదులాపురం పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, మన ఊరు – మనబడి పనులను పరిశీలించారు. వరంగల్ క్రాస్ రోడ్ లోని అంగన్వాడి స్కూల్, పల్లె ప్రకృతి వనం పరిశీలన చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.

అదే విధంగా ఏదులాపురం గ్రామంలో నూతనంగా నిర్మాణం చేయనున్న పంచాయితీ భవనానికి కేటాయించనున్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి పోలేపల్లి గ్రామానికి చేరుకొని మన ఊరు – మనబడి కింద జరుగుతున్న పనులను పరిశీలన చేసి కాంట్రాక్టర్కు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తా, ఎంపీడీవో అశోక్ కుమార్, పిఆర్‌ఏ ఈ శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్ కుమార్, గామ కార్యదర్శులు కృష్ణ, ఇమామ్, మురళి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News