Monday, December 23, 2024

జిల్లా కేంద్రాల్లోనూ పర్యాటక శోభ

- Advertisement -
- Advertisement -

* రాజధానిని మరిపిస్తున్న పర్యాటక ప్రాంతాలు
* మ్యూజికల్ ఫౌంటెన్లతో ఆకట్టుకుంటున్న సిద్దిపేట కోమటి చెరువు
* ట్యాంక్ బండ్ తరహా ‘నైట్ గ్లో గార్డెన్’కు ఐదున్నర కోట్లతో విద్యుదీకరణ
* మరో రూ. 6 కోట్లతో సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణం
* ఖమ్మం తదితర జిల్లాల్లోనూ సస్పెన్షన్ బ్రిడ్జ్‌లు

మన తెలంగాణ / హైదరాబాద్ : ఉద్యమాలకే కాదు అందమైన పర్యాటకానికి నెలవు తెలంగాణ. ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలు, వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయాలు, ఆకుపచ్చని అరణ్యాలు, గలగలపారే జలపాతాలు, లోయలు నదులు ఎన్నో.. ఎన్నెన్నో… ప్రకృతి అందచందాల్నిఆస్వాదించాలనుకునే ప్రకృతి ప్రేమికులు.. ఊటి కోడైకెనాల్‌కు వెళ్లాల్సిన అవసరం లేదుఅన్నట్లు తెలంగాణ జిల్లాల్లోనూ అందమైన జలపాతాలకు నెలవుగా మన తెలంగాణ నిలుస్తోంది. హైదరాబాద్ తరహాలో తెలంగాణ జిల్లాలు పర్యాటక శోభను సంతరించుకుంటున్నాయి. రాత్రి అయిందంటే చాలు అచ్చం హైదరాబాద్ తరహాలో మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతులతో ధగధగ లాడుతున్నాయి.

అది కూడా అత్యంత వైవిధ్య భరింతగా రంగు రంగుల విద్యుత్ దీప కాంతులతో పర్యాటకులను అలరిస్తున్నాయి. మరో వైపు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కూడా జిల్లా కేంద్రాలలోనూ రాజధాని హైదరాబాద్‌ను మరిపించేలా కోట్లాది రూపాయలు వ్యయం చేసి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ కొత్త శోభను తీసుకువస్తున్నాయి. దీంతో రాత్రి అయిందంటే చాలు మరింతగా విద్యుత్ దీప కాంతులు కిలోమీటర్ల మేర అలరిస్తూ టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. కాగా ట్యాంక్ బండ్‌లో ఉన్నట్లు బోటింగ్‌లు ఉన్నా లేకున్నా కూడా ఈ విద్యుత్ దీప కాంతులే తమను అమితంగా ఆకర్షిస్తున్నాయని పర్యాటకులు తమ హర్యాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు.

కోట్లాది వ్యయంతో అభివృద్ధి పనులు

అన్ని జిల్లాల్లోని పర్యాటకులను ఆకట్టుకునేందుకు తెలంగాణ పర్యాటక శాఖ జోరు పెంచుతోంది. కోట్లాది రూపాయలు వ్యయం చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. పగటి వేళ కంటే కూడా రాత్రిళ్లు అమితంగా ఆకట్టుకునేలా చూస్తోంది. ఇందుకోసం విద్యుత్ దీప కాంతులను ఏర్పాటు చేయిస్తోంది. అంతే కాకుండా సస్పెన్షన బ్రిడ్జ్‌లను, నైట్ గ్లో గార్డన్‌లను ఏర్పాటు చేయిస్తోంది. ఉదా.. సిద్దిపేట జిల్లానే తీసుకుంటే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట కోమటి చెరువులో రూ. 600 కోట్ల వ్యయంతో సస్పెన్షన్ బ్రిడ్ట్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని దుర్గం చెరువు వద్ద రూ. 184 కోట్ల వ్యయంతో కేబుల్ బ్రిడ్జ్‌ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సరికొత్త ఐకాన్‌గా ఈ బ్రిడ్జ్ హైదరాబాద్ పేరు తేవడంతో ఇలాంటి బ్రిడ్జ్‌లను తమ జిల్లాల్లోనూ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు.

ట్యాంక్ బండ్ తరహా మినీ చెరువులు తమ జిల్లాల్లోనూ ఉన్నాయని, ఇక్కడా తాము ఏర్పాటు చేసుకుంటామని స్థానిక ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలు ప్రభుత్వ దష్టికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే అలాంటి బ్రిడ్జ్‌లను ఏర్పాటు చేయించింది. పర్యాటకుల సంఖ్య పెంచుకునేందుకు యత్నిస్తోంది. అలాగే కోమటి చెరువు వద్దనే రూ. 5.62 కోట్ల వ్యయంతో నైట్ గ్లో గార్డెన్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇవన్నీ కూడా విద్యుత్ దీప కాంతులతో ధగధగ లాడుతూ పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తుండడం విశేషం. కోమటి చెరువు వద్దనే ఆరువందల కోట్లతో సస్పెన్షన్ బ్రిడ్జ్, నైట్ గ్లో గార్డెన్‌లు ఉన్నట్లుగానే ఇతర జిల్లాల్లోనూ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రం వద్ద రూ. 8.75 కోట్ల వ్యయంతో సస్పెన్షన్ బ్రిడ్జ్‌ని తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. ఇది ఏడాది క్రితమే పూర్తి అయింది.

ట్యాంక్ బండ్ తరహాలోనే..

హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలోనే సస్పెన్షన్ బ్రిడ్జ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు పలు ముఖ్యమైన కార్యక్రమాలు ఇక్కడ ప్రతి ఏటా ఏర్పాటు చేసుకుంటున్నారు. బతుకమ్మ వేడుకలు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద జరిగినట్లే సిద్దిపేట కోమటి చెరువు వద్దా ఆ స్థాయిలో జరుగుతుండడం విశేషం. కోమటి చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవడం వెనుక అధికారుల కృషి ఉందని పలువురు ఈ సందర్భంగ చెప్పడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News