Thursday, December 19, 2024

దక్షిణ కొరియా తరహాలో రాష్ట్రంలోనూ పర్యాటకాభివృద్ధి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దక్షిణ కొరియా తరహాలో తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. బుధవారం దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా రాజధాని సీయోల్‌లో రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని ఇండియన్ అంబాసిడర్ అమిత్ కుమార్‌తో ఆయన మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి దక్షిణ కొరియా తరహాలో స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తున్నానన్నారు.

దక్షిణ కొరియా లోని అమ్యూజ్మెంట్ పార్కులు, అడ్వెంచర్ టూరిజం, చిల్డ్రన్స్ పార్కుల తరహాలో తెలంగాణలో ఏర్పాటు కు చర్యలు తీసుకుంటామన్నారు. దక్షిణ కొరియాలో పర్యాటక, క్రీడా రంగాల్లో జరిగిన అభివృద్ధిపై ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారితో చర్చించారు. హైదరాబాద్ లోనీ టాంక్ బండ్, గండిపేట, బుద్వెల్ తదితర పర్యాటక ప్రాంతాల్లో దక్షిణ కొరియా తరహాలో పర్యాటకాభివృద్ధి కోసం పూర్తి సహకారం అందిస్తామని శ్రీనివాస్ గౌడ్‌కు అమిత్ కుమార్ భరోసానిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, అక్కడి క్రీడా మైదానాలలో మౌళిక సదుపాయాల కల్పన ఏర్పాటుకు, స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News