Wednesday, January 22, 2025

25 కోట్ల నిధులతో పాలకుర్తిలో టూరిజం హోటల్

- Advertisement -
- Advertisement -
టూరిజం హోటల్ నిర్మాణంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

మనతెలంగాణ/ హైదరాబాద్ : పాలకుర్తిలో టూరిజం హోటల్ ను విశాలంగా నిర్మించాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. రూ. 25 కోట్ల నిధులతో పాలకుర్తిలో నిర్మించనున్న టూరిజం హోటల్ నిర్మాణ పనులపై సోమవారం హైదరాబాద్‌లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. పాలకుర్తి, వల్మీడి, బమ్మెరలు ఎంతో చారిత్రాత్మకమైన ప్రాంతాలు, ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక నిధులతో టూరిజం కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. పాలకుర్తిలో టూరిజం హోటల్ ను విశాలంగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పాలకుర్తికి వచ్చే టూరిస్టులు, భక్తులకు హోటల్ ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. హోటల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి, మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News