Monday, December 23, 2024

పదేళ్లలో పర్యాటక రంగం ఎంతో అభివృద్ది సాధించింది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఓయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. శనివారం పదేళ్లలో తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధి – మేనేజ్ మెంట్ దృక్కోణం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. తెలంగాణ పర్యాటక శాఖ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ కె. అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని, వివిధ దేశాలను పర్యటకులు వచ్చి పలు ప్రాంతాలను సందర్శించారని పేర్కొన్నారు. హైదరాబాద్ సహా ఆయా జిల్లాల్లో ఉన్న పర్యాటక స్థలాల అభివృద్ధి, వసతులను తెలియజేశారు. టూరిజం విభాగం నిర్మించిన పలు డాక్యుమెంటరీలు ప్రదర్శించారు. పర్యాటక రంగంలో తెలంగాణ ప్రగతిని ఓయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాములు, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి, విభాగాధిపతి ప్రొఫెసర్ డి. చెన్నప్ప కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News