Saturday, January 4, 2025

పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కాసేపట్లో క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా సిఎం జగన్ ప్రారంభించనున్నారు. పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాల వద్ద ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. టూరిస్టులకు భద్రత, సమాచారం అందించేలా చర్యలు చేపట్టనున్నారు. టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు 24 గంటలూ పని చేయనున్నాయి. ప్రత్యేక శిక్షణ తీసుకున్న వారికి స్టేషన్లలో విధులు నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News