ఛార్టెడ్ విమానాల్లో వచ్చే వారికే!
వాణిజ్య విమానాల్లో వచ్చేవారు మరో నెల ఆగాల్సిందే!!
న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో దాదాపు సంవత్సరంన్నరపాటు భారత్ పర్యాటక వీసాలను రద్దుచేసింది. అయితే ఇప్పుడు పర్యాటక వీసాలను అక్టోబర్ 15 నుంచి జారీచేయనున్నట్లు ప్రకటించింది. కానీ వీరిని కూడా నెలపాటు ఛార్టెడ్ విమానాల్లో వస్తేనే అనుమతించనుంది. ఎవరైతే వాణిజ్య విమానాల్లో(కమర్షియల్ ఫ్లయిట్స్) రావాలనుకుంటున్నారో వారు మాత్రం మరో నెల…అంటే, నవంబర్ 15 వరకు ఆగాల్సిందేనని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఛార్టెడ్ విమానాల్లో భారత్ కు వచ్చే వారికి మాత్రం 2021 అక్టోబర్ 15 నుంచి పర్యాటక వీసాలు జారీచేయనున్నట్లు హోమ్ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రభుత్వం గత ఏడాది ఇచ్చిన అన్ని వీసాలను రద్దు చేసింది. అంతేకాక అంతర్జాతీయ పర్యటనపై ఇతర అనేక రకాల ఆంక్షలు కూడా విధించింది. అనేక రాష్ట్రాలు పర్యాటక వీసాలు జారీచేయాల్సిందిగా వినతులు సమర్పించడంతో హోం వ్యవహారాల శాఖ, ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రితశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, పౌర విమానయాన మంత్రిత్వశాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ, విదేశీ పరాటకులు ఎకువగా వచ్చే రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
- Advertisement -