Friday, December 27, 2024

వర్షాలకు చిక్కుకున్న పర్యాటకులు సురక్షితం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముత్యాల ధార జలపాతం వద్ద వాగు ఉధృతం వల్ల అటవీ ప్రాంతంలో చిక్కుకున్న సుమరు 160 మంది పర్యాటకులు సురక్షితంగా ఉన్నారని పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు , సత్యవతి రాథోడ్‌ల ఆదేశంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన గజ ఈతగాళ్లు, రెస్క్యూ టీం లు , పోలీసులు, అటవీ శాఖ,రెవెన్యూ అధికారుల సహాకారంతో ఘటన స్థలం చేరుకొని తెల్లవారు ఝామున 4గంటలకు వాగు ఉధృతి నుండి సుమారు 160 మంది పర్యాటకులని కాపాడి క్షేమంగా వారిని దాటించి వెంకటాపురం మండల కేంద్రానికి జిల్లా అధికారులు తీసుకురాగలిగారన్నారు.

ఈ ఘటనలో ములుగు జిల్లా కలెక్టర్ , ఎస్‌పి, జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండడం వల్లే చిక్కుకున్న పర్యాటకులను సురక్షితంగా తీసుకురాగలిగామన్నారు. ఇందుకు కృషి చేసిన అటవీ, పోలీస్ , రెవెన్యూ శాఖల అధికారులు, ములుగు జిల్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందింస్తున్నట్లు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ముత్యం ధార జలపాతం వద్ద పర్యాటకులు చిక్కుకున్న సమాచారం తెలిసిన వెంటనే జిల్లా మంత్రులు, అధికార యంత్రంగా తాను కూడా నిరంతరం సమీక్షించినట్లు ఆయన వెల్లడించారు. ఇకనైనా అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతాల వద్దకు అటవీ శాఖ అధికారాల అనుమతి లేకుండా వెళ్ళడం సురక్షితం కాదనే విషయాన్ని పర్యాటకులు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, పొంగిపొర్లుతున్నాయన్నాయని, జలపాతాల సందర్శనకు వచ్చే పర్యాటకులు కాసింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News