Wednesday, January 22, 2025

హిమాచల్‌లో ట్రాఫిక్ జామ్..

- Advertisement -
- Advertisement -

సిమ్లా : క్రిస్మస్ , నూతన సంవత్సర వేడుకలకు దూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విహార యాత్రికులు తరలిరావడంతో హిమాచల్ ప్రదేశ్ సందడిగా మారింది. అత్యంత సుందర పర్వత ప్రాంతాలైన లహౌల్, స్పితి ప్రాంతాలకు వెళ్లే దారిలో మైళ్ల కొద్ది ట్రాఫిక్ జాం ఏర్పడింది. పర్యాటకుల పరిస్థితి గురించి సిమ్లా అధికార యంత్రాంగం వెంటనే డ్రోన్లతో పర్యవేక్షణకు దిగింది. లహోల్ , స్పితి జిల్లాల అధికారులు క్షణం తీరిక లేకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శాంతిభద్రతలను సమీక్షిస్తున్నారు. ఈ ప్రాంతంలో రాకపోకల నియంత్రణ, టూరిస్టు భద్రతకు రంగం సిద్ధం అయింది.

ముందుకు వెళ్లలేక, వెనుకకు రాలేక పర్యాటకులు తమ వాహనాలను రోడ్డుపైనే, సమీపంలోనే వదిలిపెట్టాల్సి వచ్చింది. సిమ్లా, మనాలీ ఇతర ప్రాంతాలు కూడా జనసమ్మర్థంతో కిటకిటలాడుతున్నాయి. మనాలీ రోహతంగ్ , అటల్ టన్నెల్ వైపు వెళ్లే రాదార్లు ఇప్పుడు కదలని దార్లు అయ్యాయి. ఓ వైపు భారీ స్థాయి మంచు , కమ్యూనికేషన్ సమస్యలతో పర్యాటకులు విలవిలాడుతున్నారు. తాము అనుకున్న చోటికి చేరేలోగా సెలవులు అయిపోతాయని అన్పిస్తోందని ఒకరు సామాజిక మాధ్యమ పోస్టింగ్‌కు దిగారు. మరొకరైతే ఇక్కడనే తమకు కొత్త ఏడాది పొద్దు పొడిచేలాగా ఉందని మరొక్కరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News