Thursday, January 23, 2025

బొగతలో జన సందడి

- Advertisement -
- Advertisement -

వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం జన సందడితో కళకళలాడుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో పలు ప్రాంతల నుండి పర్యాటకులు తరలివచ్చారు. ప్రకృతి ఒడిలో నుండి జాలువారుతున్న జలపాతం అందాలను వీక్షిస్తూ పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ ఆహ్లాదాన్ని అస్వాదించారు. అక్కడ ఉన్న ఈత కొలనులో ఈత కొడుతూ పర్యాటకులు సందడి చేశారు. పర్యాటకులు వరద ప్రవాహాం లోకి దిగకుండా అక్కడి అటవీ శాఖ సిబ్బంది పర్యవేక్షణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News