Friday, November 22, 2024

క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు టోర్నమెంట్లు దోహదం

- Advertisement -
- Advertisement -
  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

పెద్దేముల్: క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు క్రికెట్ టోర్నమెంట్‌లు దోహదం చేస్తాయని ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దేముల్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ మైదానంలో బీఆర్‌ఎస్ యువనేత పట్నం రినీశ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పీఎంఆర్ క్రికెట్ టౌర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు టాస్ వేసి ఫైనల్ మ్యాచ్‌ను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల పరిచయం చేసుకుని, కాసేపు బ్యాటింగ్ చేసి నిర్వాహకులను ఉత్సాహ పరిచారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రీడల వలన స్నేహాభావ సంబంధాలు ఏర్పడుతాయని.. ప్రతిఒక్కరూ క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గ్రామీణ ప్రాంత యువకులను ప్రోత్సహించేందుకు క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌డీఏ చైర్మన్ నారాయణరెడ్డి, తట్టేపల్లి పీఏసీఎస్ ఛైర్మన్ లక్ష్మారెడ్డి, యువ నాయకులు మహిపాల్ రెడ్డి, మారేపల్లి సర్పంచ్ బల్వంత్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్, సీనియర్ నాయకులు డీవై నర్సింహులు, నారాయణ గౌడ్, ఇందూరు ప్రకాష్, కుమ్మరి విఠల్, ఎర్ర బాలప్ప, హర్షవర్ధన్ రెడ్డి, ప్రభుకుమార్, నరసింహా, అరుణ్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News