Tuesday, November 5, 2024

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే టోర్నమెంట్లు

- Advertisement -
- Advertisement -
  • మంత్రి చామకూర మల్లారెడ్డి

ఘట్‌కేసర్: గ్రామీణా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రతి ఏటా క్రీడాపోటీలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్‌కేసర్ మండలం కాచవాని సింగారంలోని ఓ క్రికెట్ గ్రౌండ్‌లో గత మూడు రోజులుగా జరుగుతున్న మల్లారెడ్డి క్రికెట్ టోర్నమెంట్ చివరి రోజు ఆదివారం కాచవాని సింగారం, చౌదరిగూడ జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన చౌదరిగూడ జట్టుకు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా ట్రోఫీతోపాటు 50 వేల బహుమతి, రన్నర్ టీమ్‌గా నిలిచిన కాచవాని సింగారం జట్టుకు ట్రోఫితో పాటు 25 వేల బహుమతి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడాకారులు నిత్య సాధనతోనే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని, ఇలాంటి టోర్నమెంట్‌లు క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చామకూర భద్రారెడ్డి, పోచారం మున్సిపాలిటీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, సర్పంచ్‌లు కొంతం వెంకట్‌రెడ్డి, ఓరుగంటి వెంకటేష్ గౌడ్, నల్లో యాదగిరి, ఎంపిటీసి నీరుడి రామారావు, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగులపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, ఘట్‌కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, నాయకులు డొంకని బిక్షపతి గౌడ్, నీరుడి శ్రీనివాస్, మంకం రవి, మంకయ్య, బొడిగె ఐలేష్ యాదవ్, మేకల నర్సింగ్ రావు, నీరుడి కుమార్, కట్ట కృష్ణ, నీరుడి సురేష్, చింతపంటి జంగయ్య, నీరుడి హరీష్, బండారి అంజనేయులు గౌడ్, ఎర్రోళ్ళ శ్రీనివాస్, బొడ్డు నాగార్జున, దయ్యాల అంజనేయులు, మణ్యం, ఉడుగుల సత్యనారాయణ, మోగుల్ల సంతోష్ కుమార్ గౌడ్, రాజగోని మహేష్, వడ్తా పవన్ నాయక్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

క్రీడా ప్రాంగణం సమీపంలో నాయకులకు మందు, విందు

క్రీడా ప్రాంగణంలో ఎన్నికల స్టంట్ వాతావరణం కనిపించింది. మధ్యాహ్నం సమయంలోనే క్రీడా ప్రాంగణం సమీపంలో బిఆర్‌ఎస్ నాయకులకు మంత్రి కుమారుడి ఆధ్వర్యంలో మందు విందు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా ఈ క్రీడాకారులకు రెండు రోజులుగా సాయంత్రం వేళలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం పంపిణీ చేయడం క్రీడా ప్రాంగణంలో చర్చకు దారితీసింది. క్రీడాకారులకు గుట్టు చప్పుడు కాకుండా మద్యం పంపిణీ చేయడం ఏమిటన్న వాదనలు వినిపించాయి.

నాయకుల స్వార్థానికి మద్యం పంపిణి చేస్తున్నారని ఆరోపణలు వినిపించాయి, ఇప్పుడే ఇలా ఉంటే ముందు ఎన్నికల సమయంలో మద్యం పంపకాలు ఏలా ఉంటాయో ఉహించుకుంటే భయమేయక మానదు. యువత మున్ముందు మద్యం మత్తులో మునిగిపోతారా లేక చైతన్య వంతులుగా ఉంటారా అనేది వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News