Saturday, December 21, 2024

డెలవరీ కోసం వస్తే టవల్ పెట్టి కుట్లేశాడు…

- Advertisement -
- Advertisement -

లక్నో: గర్భిణీ డెలవరీ కోసం ఆస్పత్రికి వస్తే వైద్యుడు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశాడు. కడుపు లోపల టవల్ పెట్టి కుట్టేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆమ్రోహా ప్రాంతంలో నజ్రానా అనే మహిళ నిండు గర్భిణీ పురిటి నొప్పులతో సైపీ నర్సింగ్ హోమ్‌కు వచ్చింది. పురిటి నొప్పులు రావడంతో వెంటనే వైద్యుడు మత్లూబ్ ఆపరేషన్ చేసి పాపను బయటకు తీశాడు. నిర్లక్షంతో ఆమె కడుపులో టవల్ పెట్టి కుట్లేశాడు. ఇంటికి వచ్చిన తరువాత కడుపులో విపరీతమైన నొప్పి ఉండడంతో మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ స్కానింగ్ చేయగా కడుపులో వస్తువు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే మళ్లీ ఆపరేషన్ చేసి టవల్‌ను బయటకు తీశారు. ఈ ఘటనపై జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీవ్ సింఘాల్ స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, తప్పు చేసిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News