- Advertisement -
ఎసిబి వలకు ఓ అవినీతి చేప చిక్కింది. హైదరాబాద్ సరూర్ నగర్ లో గురువారం ఎసిబి అధికారులకు టౌన్ ప్లానింగ్ అధికారిని పట్టుబడింది. సరూర్ నగర్ లోని జిహెచ్ఎంసి హయత్ నగర్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. గుర్రంగుడాకు చెందిన ఒక వ్యక్తి వద్ద నుండి 1.5 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా టౌన్ ప్లానింగ్ అధికారిని ఉమ తోపాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగి లక్ష్మన్ ను ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఇంటి నిర్మాణ అనుమతుల కోసం అప్లై చేసుకోగా అనుమతులు ఇవ్వడానికి రెండు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. సదరు బాధితుడు 1.5 లక్షలకు ఒప్పుకోగా ఈరోజు 1.5 లక్షల రూపాయలు ఇస్తుండగా అధికారులు పట్టుకుని రిమాండ్ కు తరలించారు.
- Advertisement -