రాకింగ్ స్టార్ యష్ లేటెస్ట్ సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ గురించి అమెరికన్ నటుడు కైల్ పాల్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇందులో ఆయన ఓ కీలక పాత్రలో నటించారు. దీని గురించి కైల్ పాల్ స్పందిస్తూ “నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో నాకు కలిగిన అనుభవం బెస్ట్ అని చెబుతాను”అని అన్నా రు. భాష పరంగా తనకు తెలియకపోయినప్పటికీ సినిమా సెట్స్‌లోకి అడుగు పెట్టిన విషయాలను ఆయన వివరించారు.
“తెలియని భాషలో భావోద్వేగ సన్నివేశాల్లో నటించటం అనేది ఎం తో సవాలుతో కూడుకున్నది. కానీ ఆ వర్కింగ్ ఎ క్స్‌పీరియన్స్ మరచిపోలేను” అని పాల్ వెల్లడించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న టాక్సిక్ చిత్రం ప్రేక్షకులకు సినిమాటిక్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. కన్నడ, ఇంగ్లీష్‌లో రూపొందిస్తోన్న తొ లి భారీ చిత్రంగా టాక్సిక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మన భారతీయ కథనానికి, అంతర్జాతీయ ప్రేక్షకుల మధ్య వారధిగా ఈ చిత్రం నిలుస్తుంది. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలు సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. కె.వి.ఎన్.ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ నిర్మిస్తోన్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ చిత్రం యాక్షన్ జోనర్‌కి ఓ సరికొత్త నిర్వచనాన్ని చెప్పనుంది.