- Advertisement -
అకాబా: జోర్డాన్ లోని అకాబాలో గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడడంతో క్లోరిన్ గ్యాస్ లీకేజీ అయింది. క్లోరీన్ గ్యాస్ లీకేజీ కావడంతో 13 మంది మృత్యువాతపడగా 251 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని స్థానిక ఆస్ప్రతులకు తరలించారు. గ్యాస్ లీకేజీలో కావడంతో కొందరు ఊపిరాడక చనిపోయారు. ఆ ట్యాంకర్ లో 25 టన్నుల క్లోరీన్ గ్యాస్ ను రవాణా చేస్తుండగా బోల్తాపడింది. జన సమూహం ఉన్న ప్రాంతంలో బోల్తాపడడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. స్థానికులు ఇండ్లలోనే ఉండాలని, కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని ఎవరు బయటకు రావొద్దని స్థానిక ఆరోగ్య అధికారి డాక్టర్ జమాల్ ఒబీదత్ తెలిపాడు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది.
- Advertisement -