- Advertisement -
కన్నడ స్టార్ యశ్ తన అభిమానులకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’. బుధవారం యశ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మూవీ గ్లింప్స్ మేకర్స్ విడుదల చేశారు. హాలివుడ్ రేంజ్ లో ఉన్న గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. కెజిఎఫ్ సిరీస్ తర్వాత యశ్ నటిస్తున్న మూవీ ఇదే. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
- Advertisement -