Thursday, January 16, 2025

టయోటా కోటి కార్ల అమ్మకం!

- Advertisement -
- Advertisement -

Toyota Company Sold 1.5 Crore Cars

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలను చిప్ కొరత, సప్లై చైన్ రంగం తీవ్రంగా దెబ్బ తీశాయి. గత ఏడాది ఆయా కంపెనీల ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. కాగా 2021లో జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మాత్రం రికార్డు స్థాయిలో అమ్మకాలను జరిపింది. జపాన్‌కు చెందిన టయోటా మోటార్ తమ వాహన విక్రయాలు 2021లో 10.1 శాతం పెరిగాయని పేర్కొంది. వరుసగా రెండో ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించి టయోటా రికార్డులు క్రియేట్ చేసింది. సమీప ప్రత్యర్థి జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ AG కంటే మరింత ముందుందని టయోటా తెలిపింది. అనుబంధ సంస్థలైన డైహట్సు మోటార్స్ , హినో మోటార్స్‌తో సహా 2021లో 10.5 మిలియన్(కోటీకిపైగా) వాహనాల అమ్మకాలు జరిపినట్లు టయోటా వెల్లడించింది.

ఫోక్స్ వ్యాగన్ అంతంతే..!

2020తో పోల్చితే గత ఏడాదిలో ఫోక్స్ వ్యాగన్ అమ్మకాల సంఖ్య భారీగా పడిపోయింది. 2020 కంటే 5 శాతం తక్కువ అమ్మకాలను 2021లో నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఫోక్స్‌వ్యాగన్ కేవలం 8.9 మిలియన్ల కార్ల అమ్మకాలను జరిపింది.

అమెరికన్ కంపెనీలకు భారీ షాక్..!

90 సంవత్సరాల తరువాత అమెరికాలో అత్యధికంగా అమ్ముడైన కార్ల బ్రాండ్‌గా టయోటా నిలిచింది. 2021గాను యుఎస్ ఆటోమొబైల్ మార్కెట్లలో అత్యధికంగా కార్లను విక్రయించిన కిరీటాన్ని టయోటా మోటార్స్ సొంతం చేసుకుంది. స్థానిక ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ షాకిస్తూ టయోటా గత ఏడాది అమెరికాలో అత్యధిక కార్లను సేల్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News