Monday, December 23, 2024

లిమిటెడ్-ఎడిషన్‌ను పరిచయం చేసిన టొయోటా

- Advertisement -
- Advertisement -

బెంగుళూరు: టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) దాని ప్రసిద్ధ మోడళ్లైన గ్లాన్జా, అర్బన్ క్రూయిజర్ టైసర్ మరియు అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లలో ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేయడం ద్వారా కార్ల కొనుగోలుదారులకు ఈ సంవత్సరాంతం గుర్తుండిపోయేలా చేసింది.ఇటీవల విడుదల చేసిన ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్‌లకు అద్భుతమైన స్పందన వచ్చిన తరువాత, స్పెషల్ లిమిటెడ్-ఎడిషన్ టొయోటా జెన్యూన్ యాక్సెసరీ (టిజిఎ) ప్యాకేజీలను అందించడం ద్వారా వినియోగదారుల కేంద్రీకృత పట్ల టొయోటా యొక్క నిబద్ధతను మరింత ముందుకు తీసుకువెళ్లింది. స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ కాకుండా, టొయోటా గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ టైసర్ & రూమియన్ (CNG మోడల్‌లు మినహా)లో రూ. 1 లక్ష పైన ప్రత్యేకమైన ఇయర్ ఎండ్ ఆఫర్‌లను అందిస్తోంది. అద్భుతమైన వినియోగదారు ప్రయోజనాలు 31 డిసెంబర్ 2024 వరకు కొనసాగుతాయి

టొయోటా కస్టమర్ ఫస్ట్ ఫిలాసఫీపై శబరి మనోహర్ – వైస్ ప్రెసిడెంట్, సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్, టొయోటా కిర్లోస్కర్ మోటర్ మాట్లాడుతూ, “మేము గతంలో ప్రకటించిన గ్లాన్జా, అర్బన్ క్రూయిజర్ టైసర్, మరియు అర్బన్ క్రూయిజర్ హైరైడర్ యొక్క ఫెస్టివల్ ఎడిషన్‌లకు అద్భుతమైన కస్టమర్ స్పందన పట్ల సంతోషంగా వున్నాము . ప్రతి ఒక్కటి ప్రీమియం స్టైలింగ్ మరియు అధునాతన ఫీచర్‌ల యొక్క ప్రత్యేకమైన కలయికను అందిస్తోంది. గ్లాన్జా , అర్బన్ క్రూయిజర్ టైసర్ & అర్బన్ క్రూయిజర్ హైర్‌డైయర్ యొక్క కొత్త స్పెషల్ లిమిటెడ్-ఎడిషన్ మా కస్టమర్‌ల యొక్క మెరుగైన ప్రాధాన్యతలకు అనుగుణంగా, వారి యాజమాన్య అనుభవాన్ని మెరుగుపరిచే ఆఫర్‌లను రూపొందించడంలో మా అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది” అని అన్నారు.

గ్లాన్జా , అర్బన్ క్రూయిజర్ టైజర్, అర్బన్ క్రూయిజర్ హైర్‌డైయర్ యొక్క స్పెషల్ లిమిటెడ్-ఎడిషన్ బుకింగ్‌లు ఇప్పుడు అన్ని టయోటా డీలర్‌షిప్‌లలో తెరవబడ్డాయి, అలాగే ఆన్‌లైన్‌లో www.toyotabharat.com/online-booking వద్ద కూడా చేసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News