Thursday, January 16, 2025

 మొట్టమొదటి ‘గ్రేట్ 4×4 X-పెడిషన్’ను ప్రకటించిన టయోటా కిర్లోస్కర్ మోటర్

- Advertisement -
- Advertisement -

బెంగుళూరు: టయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM) దేశవ్యాప్తంగా ఉన్న మోటరు ప్రేమికుల కోసం 4×4 అనుభవపూర్వక డ్రైవ్స్ యొక్క మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు ప్రకటించింది. ‘గ్రాండ్ నేషనల్ 4×4 ఎక్స్-పెడిషన్’ నాలుగు జోన్లలో (ప్రాంతీయ స్థాయి – నార్త్, సౌత్, ఈస్ట్ మరియు వెస్ట్) నిర్వహించేందుకు టయోటా ఈ సంవత్సరం ప్రణాళిక చేసింది . ఈ డ్రైవ్‌లు దేశవ్యాప్తంగా 4×4 SUV కమ్యూనిటీ ని చేరుకునేలా రూపొందించబడ్డాయి, ఇవి అద్భుతమైన మరియు థ్రిల్లింగ్ ఆఫ్-రోడింగ్ అనుభవాలను అందిస్తాయి. ఈ కార్యక్రమం లో పాల్గొనేవారిని వారిలో దాగిన సాహసోపేత భావనల తో అనుసంధానించడానికి మరియు హద్దులను అధిగమించడానికి, కొత్త ప్రాంతాలను అన్వేషించడానికి తద్వారా ‘మాస్ హ్యాపీనెస్’ని అందించడానికి వారిని ప్రేరేపించాలని TKM కోరుకుంటుంది.

ప్రతి జోనల్ ఈవెంట్‌లో SUVల కాన్వాయ్‌ పాల్గొంటుంది. వీటిలో ప్రముఖ మోడల్స్ అయిన లెజెండరి Hilux, Fortuner 4X4, LC 300 మరియు హై రైడర్‌ AWD (ఆల్ వీల్ డ్రైవ్) ఉంటాయి. ఇంకా, ఈ వినూత్న మైన డ్రైవ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, భారతదేశంలో టయోటా నిర్వహించే మొట్టమొదటి గ్రేట్ 4×4 X-పెడిషన్‌లో ఇతర SUV బ్రాండ్ యజమానులు కూడా పాల్గొనవచ్చు . మహోన్నత మైన ఆఫ్-రోడింగ్‌ను అందించాలనే ఉద్దేశ్యంతో, TKM అనేక సవాళ్లతో కూడిన అడ్డంకులతో అదనపు 4WD ట్రాక్‌లను రూపొందించింది, వీటిలో ఆర్టిక్యూలేషన్ , సైడ్ ఇంక్లైన్‌లు, రాంబ్లర్, లోతైన గుంట, స్లష్, రాకీ బెడ్ మరియు మొదలైనవి ఉంటాయి.

ప్రపంచవ్యాప్తంగా టయోటా, SUVల యొక్క శక్తివంతమైన శ్రేణి కి ప్రసిద్ధి చెందింది మరియు భారతదేశంలో కూడా శక్తివంతమైన మరియు బహుముఖ 4×4 ఆఫర్‌ను కలిగి ఉంది. Hilux, Fortuner 4X4, LC 300 మరియు అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లు తమ ఉనికిని కలిగి ఉండటంతో కొన్ని భారీ సంఖ్య లో అభిమానులను సంపాదించుకున్నాయి, ప్రతి ప్రయాణాన్ని విశేషమైనదిగా మార్చడానికి సంపూర్ణంగా సరిపోయే అధునాతన శైలి, సాటిలేని దృఢత్వం మరియు శక్తివంతమైన పనితీరు వీటిలో ఉంది. టయోటా యొక్క ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఈ అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి పుష్కలమైన అవకాశాలను సృష్టిస్తుంది మరియు ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ రెండింటిలోనూ క్యూరేటెడ్ డ్రైవ్‌ల ద్వారా కొత్త అనుభవాలను అందిస్తుంది.

ముఖ్యంగా, వేగంగా అభివృద్ధి చెందుతున్న SUV సెగ్మెంట్‌లో మోటర్‌స్పోర్ట్ మరియు అడ్వెంచర్ సీకర్ల కోసం పెరుగుతున్న ట్రెండ్‌తో, వ్యాపార ప్రయోజనాల కోసం లేదా కుటుంబం మరియు స్నేహితులతో సరదాగా గడిపే క్షణాల కోసం ఎక్కువ కోరుకునే వారితో విడదీయరాని బంధం ఏర్పడింది. మోటర్‌స్పోర్ట్‌పై కంపెనీకి ఉన్న అభిరుచి (భారతదేశంలో టయోటా గజూ ఇ-మోటార్‌స్పోర్ట్ రేసింగ్ ఆగస్ట్ 2020లో ప్రారంభించబడింది) కీలకమైన లక్షణాలలో ఒకటిగా కొనసాగుతోంది, ఈ గ్రేట్ 4×4 ఎక్స్-పెడిషన్ కార్యక్రమం బ్రాండ్‌ను మోటార్‌స్పోర్ట్స్ ఔత్సాహికులతో కనెక్ట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. వారికి ఉత్తేజకరమైన డ్రైవ్ అవకాశాలను అందించడం తో పాటుగా 4×4 ఔత్సాహికుల అభిమానుల క్లబ్ యొక్క ప్రత్యేకమైన బృందాన్ని సృష్టించడం కూడా లక్ష్యం, ఇది ఆఫ్-రోడింగ్ కార్యకలాపాలలో నిరంతర నిమగ్నతను సైతం అనుమతిస్తుంది.

మొదటి ప్రాంతీయ కార్యక్రమం భారతదేశంలోని దక్షిణ భాగంలో నిర్వహించబడుతోంది. బెంగుళూరు నుండి ప్రారంభించి, 2023 మే 26 నుండి 28 వరకు హసన్ మరియు సకలేష్‌పూర్‌లోని నిర్మలమైన ప్రదేశాలను కవర్ చేయడానికి కదులుతుంది. జాగ్రత్తగా ఎంచుకున్న మార్గం చారిత్రిక ప్రదేశాలను కవర్ చేస్తూ ప్రయాణంలో సుందరమైన అందాలను అన్వేషించే అవకాశాన్ని అందిస్తుంది. పాల్గొనేవారు సురక్షితమైన మరియు పర్యవేక్షించబడే వాతావరణంలో ఆఫ్-రోడింగ్ ట్రీట్‌లో ఉంటారు, అదనంగా 4WD ట్రాక్ అనుభవాలు మరియు బహిరంగ వినోదాలను రూపొందించారు.

ఇంకా, సుస్థిరత మరియు సమాజానికి తిరిగి ఇవ్వడం పట్ల టయోటా యొక్క ప్రధాన నిబద్ధతకు అనుగుణంగా, ఈ గ్రేట్ 4×4 X-పెడిషన్ ఈ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ డ్రైవ్‌లో పాల్గొనే 4×4 ఔత్సాహికులను సామాజిక కారణాలకు సహకరించేలా చేస్తుంది. అవగాహనను వ్యాప్తి చేయడానికి మరియు వారి సామాజిక సేవను ప్రోత్సహించడానికి , ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, వ్యర్థాల సేకరణ మరియు పారవేయడం మరియు చెట్ల పెంపకం ద్వారా స్థానిక పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ వంటి అనేక పర్యావరణ కార్యకలాపాలు సహజ జీవవైవిధ్య పరిరక్షణకు ప్రణాళిక చేయబడ్డాయి.

టొయోటా యొక్క మొట్టమొదటి గ్రేట్ 4×4 X-పెడిషన్ గురించి టయోటా కిర్లోస్కర్ మోటర్ యొక్క సేల్స్ మరియు స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ మాట్లాడుతూ, “టయోటా తన కస్టమర్లకు అపరిమిత అనుభవాలను అందించడం విశ్వసిస్తుంది. ఈ దిశలో, టయోటా యొక్క 4×4 గ్రేట్ X- పెడిషన్ ను ఔత్సాహిక బృందం తో కనెక్ట్ అయ్యేలా కొత్త ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించడానికి, వారి అనుభవాలను సుసంపన్నం చేయడానికి, మాతో కలిసి చేసే మరపురాని ప్రయాణం ద్వారా జీవితాంతం వారి జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశాన్ని అందించడం కోసం రూపొందించబడింది. SUV ఔత్సాహికులు తాము సగర్వంగా స్వంతం చేసుకున్న వాహనాల యొక్క నిజమైన సామర్థ్యాన్ని ఆవిష్కరించడానికి మరియు వారి చురుకైన బహిరంగ జీవనశైలిని మరింత మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం ప్రణాళిక చేయబడింది.

TKM మోటార్‌స్పోర్ట్ ఎంగేజ్‌మెంట్‌ను మెరుగుపరచడం కొనసాగిస్తుంది, ఇది కొత్త & అధునాతన సాంకేతికతలను తీసుకురావడం, ఆవిష్కరణలను చేయటం మరియు నిత్యం -మెరుగైన కార్లను నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గ్రేట్ 4×4 X-పెడిషన్ ద్వారా, మోటర్‌స్పోర్ట్‌ల పట్ల వారి వివేచనాత్మక అభిరుచిని కొనసాగించడానికి మరియు 4×4 డ్రైవింగ్ యొక్క థ్రిల్‌ను అనుభవించడానికి మరింత మంది వ్యక్తులను ప్రేరేపించాలని TKM భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News