Saturday, April 5, 2025

టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం చార్మినార్ వద్ద ‘తోడుదొంగలు’ అనే పోస్టర్ ప్రచారం ఆవిష్కరణకు వచ్చిన సమయంలో ఆయన్ను అరెస్టు చేశారు. గోడలకు పోస్టర్లు అతికించే సమయంలో అనుమతి లేదంటూ అక్రమంగా అరెస్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ‘తోడు దొంగలు’ అనే పోస్టర్‌ను ఏఐసిసి ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్, డిసిసి సమీరుల్లా తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News