Thursday, January 16, 2025

అల్లు అర్జున్‌పై మాకు ఎలాంటి కక్ష లేదు: టిపిసిసి చీఫ్

- Advertisement -
- Advertisement -

ఓ మహిళ చనిపోతే అరెస్ట్ చేయవద్దా?
చట్టం ముందు అందరూ సమానమే
చట్టానికి ఎవరూ అతీతులు కాదు
సినీ ఇండస్ట్రీకి కాంగ్రెస్‌కు విడదీయరాని బంధం ఉంది
రేసింగ్ స్కాంలో కెటిఆర్ అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చర్యలు
టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: హీరో అల్లు అర్జున్‌పై తమకు ఎలాంటి కక్ష లేదని, ఆయన కారణంగా ఓ మహిళ చనిపోతే అరెస్ట్ చేయవద్దా అని పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కారణమని ఆయన చెప్పుకొచ్చారు. గాంధీభవన్‌లో సంజయ్ గాంధీ 44వ వర్ధంతి సందర్భంగా టిపిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ తొక్కిసలాటలో సామాన్యురాలు ప్రాణాలు కోల్పోయిందని, ఆమె కొడుకు చావుబ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన అన్నారు. అల్లు అర్జున్ మామ తమ పార్టీకి చెందిన నాయకుడేనని, సిఎం రేవంత్‌కు అల్లు అర్జున్ కుటుంబంతో బంధుత్వం ఉందని ఆయన తెలిపారు. తెలుగు చిత్ర సీమకు కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఫిల్మ్ స్టూడియోలు కట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూములు ఇచ్చి వెసులుబాటు కల్పించడమే వల్లే చిత్రసీమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిందని ఆయన తెలిపారు. చరిత్ర తెలుసుకొని బిజెపి నేతలు మాట్లాడాలని ఆయన సూచించారు.

ఈ కార్ రేసింగ్ స్కాంలో నిధుల గోల్‌మాల్..
ఈ కార్ రేసింగ్ స్కాంలో నిధుల గోల్‌మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారన్నారు. రేసింగ్ స్కాంలో కెటిఆర్ అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. బిఆర్‌ఎస్ నేతలు రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసిందని, పదేళ్లలో కెసిఆర్, కవిత, హరీష్, కెటిఆర్ తెలంగాణ విగ్రహం మీద ధ్యాస ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News