Sunday, February 23, 2025

జనవరి 3న టిపిసిసి విస్తృత స్థాయి సమావేశం..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి విస్తృత స్థాయి సమావేశం జనవరి 3వ తేదీన జరుగనుంది. పిసిసి అధ్యక్షుడు సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ ఉపాధ్యక్షుడు, డిసిసి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు హాజరు కానున్నారు.

గత ఆదివారం జరగాల్సిన విస్తృత స్థాయి సమావేశం కలెక్టర్లతో సమావేశం వల్ల జనవరి మొదటి వారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. మరో వైపు ఏఐసిసి ఇన్‌చార్జీ అయిన తరువాత మొదటిసారి ఈ సమావేశంలో దీపాదాస్ మున్షీ కూడా పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికలే ఎజెండాగా ఈ పిసిసి సమావేశం జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News