Friday, December 20, 2024

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిపిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో గత 35 ఏళ్లుగా పనిచేస్తున్న బీసీలకు గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా అనంతరం కంటతడి పెట్టుకున్న నగేష్ ముదిరాజ్.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆంధ్ర నాయకుల పెత్తనం ఎక్కువైందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వద్దు అన్న షర్మిల, చంద్రబాబులు తెలంగాణ కాంగ్రెస్ ను శాసిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ లో డబ్బులకు ఎమ్మెల్యే సీట్లను అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డబ్బు లేనివారికి కాంగ్రెస్ లో స్థానం లేదు… తనకు గుర్తింపు లేని పార్టీలో తాను కొనసాగలేనని అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముదిరాజులకు సముచిత స్థానం కల్పిస్తానని హామీనివ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సిఎం హామీపై నమ్మకం ఉంది… నా అనుచరులతో చర్చించి త్వరలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణహించుకున్నట్లు నగేష్ ముదిరాజ్ మీడియాతో వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News