హైదరాబాద్: రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల వరంగల్ లో జరిగిన బిసి సభలో మల్లన్న మాట్లాడుతూ.. రెడ్డిలపై తీవ్ర పదజాలంతో దూషించారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, రెడ్డి సంఘాల నేతలు మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని.. కాంగ్రెస్ పార్టీ, అతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేపై కూడా మల్లన్న ఘాటుగానే విమర్శలు చేశారు. ఈ క్రమంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ కోరింది. కులగణన నివేదికపై చేసిన వ్యాఖ్యలపై కూడా వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.