Monday, February 3, 2025

కేంద్రం కక్ష..వివక్ష

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై సవతి తల్లి
ప్రేమ బడ్జెట్‌లో మొండిచేయి చూపిన
మోడీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నాం
కొన్ని రాష్ట్రాలకే కేటాయింపులు జరిపితే
వికసిత్ భారత్ ఎలా సాధ్యం? కేంద్ర
మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్
రాజీనామా చేయాలి తెలంగాణ డిఎన్‌ఎ
ఉంటే బిజెపి ఎంపిలు ఇప్పటికైనా
గొంతెత్తాలి : పిసిసి చీఫ్ మహేశ్‌కుమార్
గౌడ్, మంత్రులు పొన్నం, సీతక్క
కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన

మన తెలంగాణ/హైదరాబాద్/ముషీరాబాద్ : తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టి న బడ్జెట్ దేశ సమగ్ర అభివృద్ధికి కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలకే కేటాయించినట్లుగా ఉందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ సహా కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలపై బిజెపి చూపిస్తున్న వివక్ష, రాజకీయ క క్షకు ఈ బ్డ్జెట్ కేటాయింపులే నిదర్శనమని వ్యాఖ్యానించారు. సాధారణ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపినందుకు నిరసన గా డాక్టర్ బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్ వి గ్రహం సాక్షిగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. సాధారణ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రంపై వివక్షకు నిరసనగా ఆదివా రం ట్యాంక్ బండపై ఉన్న బి.ఆర్ అంబేద్కర్ వి గ్రహం వద్ద పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌ డ్ సారథ్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి, నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి వ్యతిరేకం గా నినాదాలు చేశారు.

అనంతరం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 3వ తేదీన(సోమవారం) కేంద్రం వైఖరికి నిరసన గా రాష్ట్రవ్యాప్తంగా గల్లీ నుంచి పట్టణం వరకు రా ష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, తెలంగా ణ కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మ లను దగ్ధం చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ సంక్షేమం, అభివృ ద్ది, రాజకీయాలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా అందరు కలిసి రావాలని
సూచించారు. రాష్ట్రానికి కేంద్ర నిధులు ఇచ్చే వరకు శాంతియుతంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డికి రాష్ట్రాభివృద్ధి పట్టదా..? అంటూ వారిని ఆయన నిలదీశారు. తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే బండి సంజయ్, కిషన్ రెడ్డిలు తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం సీఎం రేవంత్, మంత్రులు ఒంటరి పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు.

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోంది
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు ఇవ్వకుండా నిర్లక్షం ప్రదర్శించారని విమర్శించారు. అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలను పంపినా బుట్టదాఖలా చేశారన్నారు. కేంద్రప్రభుత్వం బిజెపి పాలిత రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తూ.. తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఎంతో సహాయపడుతుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల వివక్ష చూపిందన్నారు. కేంద్రం వివక్షను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సాయం చేయాలని పలుమార్లు కేంద్రానికి నివేదికలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంఎల్‌ఎలు, 8 మంది ఎంపిలు ఉంటే కేంద్రం తెలంగాణకు గాడిదగుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ అభ్యున్నతి కోసం రాజకీయాలకతీతంగా ప్రతి తెలంగాణ పౌరుడు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం కక్షపూరిత వైఖరికి నిరసనగా బిఆర్‌ఎస్, తెలంగాణ వాదులు ముందుకు రావాలని మరోమారు పిలుపునిచ్చారు. మాటిమాటికి ప్రతిపక్ష బిఆర్‌ఎస్, బిజెపి నేతలు సిఎం రేవంత్ ఢిల్లీ పర్యటనను విమర్శిస్తారని, ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులపై వారు ఏం సమాధానం చెబుతారు..? అని ప్రశ్నించారు. రాష్ట్ర నిధుల కోసం సిఎం రేవంత్, మంత్రులు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసి యాచించిన తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణపై కేంద్రం విద్వేషం చూపుతోందని : మంత్రి పొన్నం
తెలంగాణపై కేంద్రం విద్వేషం చూపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బిజెపి ఎంపిలలో తెలంగాణ డిఎన్‌ఎ ఉంటే ఇప్పటికైనా గొంతు ఎత్తాలని పిలుపునిచ్చారు. కేంద్రాన్ని పదేళ్లు నిధులు అడగడం లేదని ఇన్నాళ్లు చెప్పుకొచ్చారన్నారు. రాష్ట్రాలు అన్నీ కలిస్తేనే యూనియన్ బడ్జెట్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ వివక్షతను రాష్ట్ర ప్రజలంతా ఖండించాలని మంత్రి సీతక్క కోరారు. కేంద్ర మంత్రులు ప్రధాని వద్దకు ఎన్నిసార్లు వెళ్లినా చివరకు మొండి చేయి చూపారన్నా రు. తెలంగాణ నుంచి కేంద్రంకు వెళ్తున్న పన్నులను దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించాలన్నారు. శనివారం నాటి బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ తప్ప కేంద్ర బడ్జెట్ కాదన్నారు. బిజెపి బడ్జెట్ స్వార్థ బడ్జెట్ అని ఆరోపించారు. తెలంగాణ అంటే బిజెపికి పిచ్చి విద్వేషం అని విమర్శించారు. ప్రజలు ఆలోచించాలన్నారు .

తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉందని మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మనమందరం ఐక్యతతో పోరాడాలని పిలుపునిచ్చారు. తొలుత అంబేద్కర్ విగ్రహనికి పూల మాలలు వేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. ఎంపి అనిల్ యాదవ్, ప్రభు త్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎంఎల్‌ఎలు గణేష్, ఈర్లపల్లి శంకర్, నాగరాజు, డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్‌లు మెట్టు సాయి కుమార్, మల్రెడ్డి రాంరెడ్డి, చల్ల నర్సింహారెడ్డి, రియాజ్, మహిళ కాంగ్రెస్ చీఫ్ సునీత రావ్, సామ రాంమోహన్ రెడ్డి, నియోజక వర్గ ఇంచార్జ్‌లు భారీ నిరసన, ధర్నాలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News