ఫోకస్ పెట్టిన అధిష్ఠానం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు
అన్ని కార్యవర్గాల కూర్పు చేపట్టేందుకు రంగం సిద్ధం పరిశీలకులకు
మూడుదశల్లో టాస్క్ పార్టీ మండల అధ్యక్షుడి ఎంపికకు ఐదు పేర్లు,
బ్లాక్ కాంగ్రెస్ పదవికి ముగ్గురి పేర్లను ఇవ్వాలి ఏప్రిల్ 25 నుంచి
30వరకు జిల్లా స్థాయి సమావేశాలు మే 4నుంచి 10 వరకు
అసెంబ్లీ, బ్లాక్ లెవల్ మీటింగ్ మే 13 నుంచి 20వరకు మండల
స్థాయి సమావేశాలు జిల్లాకు ఇద్దరు పరిశీలకుల కేటాయింపు
మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో టిపిసిసి పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా ఆ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కా ర్యవర్గాల కూర్పును చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే గాంధీభవన్‌లో బుధవారం రాష్ట్ర పరిశీలకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరిశీలకులకు మూడుదశల్లో టిపిసిసి టాస్క్‌ను నిర్ధేశించింది. ఏప్రి ల్ 25 నుంచి 30 తేదీ వరకు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని టిపిసిసి ఆదేశించింది. ఈ సందర్భంగా పార్టీ ప్రక్షాళనకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పరిశీలకులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా సమావేశాలకు బ్లాక్, మండల అధ్యక్షులు, ఎంపి, ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, ఏఐసిసి, పిసిసి ఆఫీస్ బేరర్లు, జిల్లా స్థాయి సీనియర్ నాయకులను ఆహ్వానించాలని ఆమె సూచించారు. దీంతోపాటు అసెంబ్లీ, బ్లాక్ లెవెల్ మీటింగ్స్ నిర్వహించడం, మండల మీటింగ్స్ ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. జిల్లాకు ఇద్దరు పరిశీలకులను కేటాయించాలని ఆమె నిర్ణయించారు. మొత్తం 70 మంది పరిశీలకులకు ఆహ్వానం పంపించాలని ఆమె సూచించారు. ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వాళ్లతో పాటు గైర్హాజరైన వారిని పరిశీలకులుగా తొలగించాలని మీనాక్షి నటరాజన్ ఆదేశించారు.
గైర్హాజరైన వారిని తొలగించాలని ఆదేశం
దీంతోపాటు ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన పరిశీలకులను తొలగిస్తూ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఈ సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో పాటు మరో ఐదుగురు నేతలను పరిశీలకులుగా తొలగి స్తూ మీనాక్షి నటరాజన్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 70 మంది పరిశీలకులకు ఈ సమావేశానికి ఆహ్వానం అందగా కొందరు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే గైర్హాజరైన వారిని తొలగించాలని ఆమె ఆదేశించారు.
2017 నుంచి పార్టీలో ఉన్న వాళ్లకే కమిటీలో చోటు
2017 నుంచి పార్టీలో ఉన్న వాళ్లకే కమిటీలో చోటు ఉండే లా చూడాలని ఆమె స్పష్టం చేశారు. ప్రతి జిల్లాకు ఇద్దరు పరిశీలకులు ఉండాలని ఆమె ఆదేశించారు. పార్టీలో మ హిళల ప్రాతినిథ్యం పెరగాలని ఆమె సూచించారు. పార్టీ మండల అధ్యక్షుడి ఎంపికకు ఐదు పేర్లు సూచించాలని, బ్లాక్ కాంగ్రెస్‌కు ముగ్గురి పేర్లను సూచిస్తూ పిసిసికి నివేదిక ఇవ్వాలని పరిశీలకులను ఆమె ఆదేశించారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో ప్రభుత్వ పనితీరు, పార్టీ పనితీరును పరిశీలకులు జాగ్రత్తగా గమనించాలని ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ పార్టీని పటిష్ట పరచాలని మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. అయితే, ఏప్రిల్ 25 నుంచి 30 జిల్లా స్థాయి సమావేశాలు, మే 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అసెంబ్లీ, బ్లాక్ లెవల్ మీటింగ్, మే 13వ తేదీ నుంచి 20వ తేదీ మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు.