Monday, December 23, 2024

టిపిసిసి ఎన్‌ఆర్‌ఐ సెల్ నూతన కమిటీ నియామకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టి పిసిసి ఎన్‌ఆర్‌ఐ సెల్ (యూఎస్‌ఏ) కమిటీ నూతన నియామకం జరిగింది. ఈ మేరకు టి పిసిసి అధ్యక్షుడు, ఎంపి రేవంత్ రెడ్డి ఆదివారం నియమక జాబితాను మీడియాకు విడుదల చేశారు. 9 మందితో కోర్ కమిటీని నియమించగా ఇందులో తిరుపతిరెడ్డి యర్రంరెడ్డి, రమేష్ చంద్ర ఆయనూర్, శరత్‌చంద్ర వేమగుంటి, నరేందర్ రెడ్డి యల్మారెడ్డి, కృష్ణ ముష్యం, చంద్ర పోలీస్, సందీప్ వెంగళ, రమణారెడ్డి కొత్త, రాజశేఖర్ మద్ది ఉన్నారు. వీరితో పాటు శాశ్వత ఆహ్వానితులుగా ప్రెసిడెంట్ ఐఓసి తెలంగాణ చాప్టర్ రాజేశ్వర్ రెడ్డి గంగసానిని నియమించారు. వీరితో పాటు 16 మందిని ఎగ్జిక్యూటివ్ సభ్యులుగాను, 6 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగాను, మరో ఇద్దరితో ఉమెన్ కమిటీని, 5 గురితో అడ్వయిజరీ కమిటీని, 7 మందితో యువజన కమిటీని, ఇద్దరితో మైనారిటీ కమిటీని, మరో నలుగురితో సోషల్ మీడియా కమిటీని, ముగ్గురితో కో ఆర్డినేషన్ కమిటీని, 15 మందితో స్టేట్ ఇంఛార్జిలుగా నియమించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News