Monday, April 28, 2025

ఆ విషయంలో కెసిఆర్ విలన్ గా మిగిలిపోతారు. : మహేష్ కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాధనం దోచుకుంది కెసిఆర్ కుటుంబం విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టులు, భూముల పేరిట దోచుకుని రాష్ట్రాలని అప్పుల పాలుజేశారని దుయ్యబట్టారు. సోమవారం టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. దూరదృష్టి, ఆలోచన లేకుండా ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసి కొంపముంచారని, పలాయనం చిత్తగించిన వ్యత్తి కాంగ్రెస్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణకు విలన్‌గా కెసిఆర్ మిగిలిపోతారని, కాంగ్రెస్‌ను విలన్ అంటున్నారని, యువతరం కెసిఆర్‌ను క్షమించదని మండిపడ్డారు.

సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురించి ఆరోపణలు చేయడం సరికాదని మహేష్ కుమార్ హితువు పలికారు. దొంగ పాస్‌పోర్టులు సృష్టించి విదేశాలకు పంపిన చరిత్ర కెసిఆర్‌ది కాదా? అని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చాక కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, తెలంగాణ సాకారం చేసినందుకు కాంగ్రెస్ విలన్‌గా నిలుస్తుందా? అని ప్రశ్నించారు. తెలంగాణను అన్ని రకాలు కెసిఆర్ నాశనం చేశారని, టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చి పార్టీ పేరులో తెలంగాణ పదమే తొలగించారని మహేష్ కుమార్ దుయ్యబట్టారు. రెండు పడక గదుల ఇళ్లు ఘరానా మోసం అని ప్రజలకు తెలుసునని, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కింద రూ.4.5 లక్షల మందికి ఇస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News