Tuesday, April 8, 2025

మేము సన్న బియ్యం ఇచ్చాము… దేశం మొత్తం బిజెపి ఇవ్వాలి: మహేష్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : 42 శాతం బిసి రిజర్వేషన్‌లను 9వ షెడ్యూల్లో చేర్చేలా చట్టబద్దత కోసం దమ్ముంటే ప్రధానిని ఒప్పించాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాలు చేశారు. కేంద్ర మంత్రి అన్న సంగతి మర్చిపోయి దిగజారి మాట్లాడుతున్నాడని ఆయన బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బిజెపి నేతలు బిసిల ధర్నాకు మొహం చాటేశారని విమర్శించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేశాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని, ఏదైనా సమిష్టి నిర్ణయాలు ఉంటాయని ఆయనన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, ఎంఎల్‌సి ఎన్నికల వలె స్థానిక సంస్థలు ఎంఎల్‌సి ఎన్నికల్లోనూ బిజెపి, బిఆర్‌ఎస్ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక రహస్య మిత్రుడు బిఆర్‌ఎస్‌తో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆయన బిజెపిపై ధ్వజమెత్తారు.

బండి సంజయ్‌లో రోజురోజుకు అభద్రత భావం పెరిగిపోతుందని, సొంతపార్టీ నేతలే బండి సంజయ్ వైఖరి పై గుర్రుగా ఉన్నారని దుయ్యబట్టారు. అధ్యక్ష పదవి రాదని తెలిసి బండి సంజయ్ ఆగమాగం అయితుండని విమర్శించారు. తాను కేంద్ర మంత్రి అన్న సంగతి మర్చిపోయి దిగజారి మాట్లాడుతున్నాడని, బిజెపిలో గుర్తింపు కోసం బండి సంజయ్ ఆరాటమని దుయ్యబట్టారు. ఇకనైనా బాధ్యత గల కేంద్రమంత్రిగా వ్యవహరించాలని హితవు పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి బండి సంజయ్ కి కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సుదీర్ఘ కాలంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం చేసుకోలేని బిజెపికి కాంగ్రెస్ హై కమాండ్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి పట్టు సాధించ బట్టే బిసి రిజర్వేషన్లు, ఎస్‌సి వర్గీకరణ బిల్లులకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు. హెచ్‌సియు అంశం ఉన్నత న్యాయ స్థాన పరిదిలో ఉందని. ప్రభుత్వం కమిటీ వేసిందని, రాజకీయ అవసరాల కోసం బండి సంజయ్ మాట్లాడడం సమంజసం కాదని పిసిసి చీఫ్ అన్నారు. మైనార్టీ హక్కుల కోసం నిలబడి కాంగ్రెస్ వక్ఫ్ బోర్డు బిల్లు పై నిర్ణయం తీసుకుందని, కార్పొరేట్ సంస్థలను నయనా, భయానా బెదిరించి నిధులు రాబట్టుకున్న బిజెపి నంబర్ వన్ గా నిలిచిందని విమర్శించారు. సన్న బియ్యం బిజెపి ఇస్తుంటే దేశం మొత్తం ఇవ్వచ్చు కదా, సన్న బియ్యంతో తెలంగాణలో నిరుపేదలకు అసలైన పండుగను కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందన్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయే కుల గణన, బిసి బిల్లు, ఎస్‌సి వర్గీకరణ, సన్న బియ్యంను కాంగ్రెస్ హయంలో అమలు అయ్యాయని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేవారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News