Friday, December 20, 2024

ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఎన్నికల్లో పార్టీకి సహకరించిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికీ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారని ఆయన పేర్కొన్నారు. మీ కష్టం, మీ శ్రమ వృధా కాలేదు, తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిది అంటూ అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. మీ కష్టం, మీ శ్రమ వృథా కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News