Sunday, December 22, 2024

ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు ఘనంగా స్వాగతం పలికిన టిపిసిసి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు, తుక్కుగూడలో జరిగే విజయభేరి సభ కోసం వచ్చిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, సీనియర్ నేత జైరాం రమేశ్ తదితరులకు శంషాబాద్ విమానాశ్రయంలో పిసిసి నేతలు స్వాగతం పలికారు. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో కాంగ్రెస్ కీలక కార్యక్రమాలు ఉండడంతో వాటి ఏర్పాట్లపై సమీక్షించడానికి పార్టీ సీనియర్లు రెండు రోజుల ముందుగానే హైదరాబాద్‌కు చేరుకున్నారు.

16వ తేదీన తాజ్ కృష్ణా హోటల్లో జరిగే సిడబ్ల్యూసి సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్‌రావు ఠాక్రే సమీక్ష జరిపారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే సిడబ్ల్యూసి సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ముఖ్య అతిథులు తదితరులకు వసతి సౌకర్యాలు, మీటింగ్ ఏర్పాట్లు తదితరాలపై కెసి వేణుగోపాల్ పిసిసి నాయకులతో సమీక్ష జరిపారు. సోనియాగాంధీ పాల్గొనే విజయభేరి సభ కోసం తుక్కుగూడలో జరుగుతున్న ఏర్పాట్లను సైతం ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News