Wednesday, January 22, 2025

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దే అధికారం: మహేష్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నదని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్‌ఎస్‌యూఐలో రాజకీయ జీవితం ప్రారంభించిన ఎపి పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ అక్కడ కూడా బలోపేతం అవుతుందన్నారు. విద్యార్థి రాజకీయాల్లో గడించిన అనుభవం కలిగిన నేత కావడంతో రాజకీయాల్లో సులువుగా రాణించగలరని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

దేశ వ్యాప్తంగా ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లలో పనిచేసిన వాళ్లకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి కూడా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా పనిచేసిన వారేనని చెప్పారు. గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలు తమ మీద విశ్వాసం ఉంచి ఎపి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారన్నారు.

కష్టపడిన వారిని కాంగ్రెస్ ఆదుకుంటుందన్నారు. పరిపాలన పరంగానే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు విడిపోయాయని, మనుషులు అంతా ఒకటేనని చెప్పారు. రాష్ట్రంలో 30 నుంచి 40 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆంధ్ర సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉన్నదన్నారు. వాళ్లందరిని సమన్వయం చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాననన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News