Sunday, January 19, 2025

రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీలకు టిపిజెపి ఎంట్రీలు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: ప్రపంచ ఫొటో గ్రపీ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ ఫొ టో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ గస్టు 19న రవీంద్ర భారతి వేదికంగా రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహించనున్నట్లు టిపిజెపి వ్య వస్థాపక రాష్ట్ర అధ్యక్షులు జి.భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. చిన్నయాదగిరి గౌడ్‌లు తెలిపారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించనున్న ఈ పోటీల్లో రాష్ట్రంలోని ఫొటో జర్నలిస్టులందరూ పాల్గొనవచ్చని తెలిపారు. అసక్తిగల ఫొటో జర్నలిస్టులు మూడు కేటగిరిలకు సంబంధించి 12/18 సైజ్‌లతో కూడిన ఛా యా చిత్రాలను పంపించాల్సింది కోరారు.

కేటగిరి 1లో ఉత్తమ న్యూస్ పిక్చర్, కేటగిరి 2లో పదేళ్లలో తెలంగాణ అభివృద్ధి ప్రతిబింభించే చిత్రాలు (వ్యవసాయం, సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, ప్రాజెక్టులు, చెరువులు, చేతి వృత్తులు తదితరాలు) కేటగిరి 3 కింద ప్రాచీన కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు, పల్లె అందాలు, జాతరలు, పండుగలు, కళా రూపాలకు సంబంధించినవి పంపించాల్సి ఉం టుందన్నారు. అయితే ప్రతి కేటగిరిలోను 2 ఫోటోలను మాత్రమే పంపిచాల్సి ఉంటుందని, ప్రతి ఫొ టో వెనుక జర్నలిస్టు పేరు, పనిచేస్తున్న మీడియా సంస్థ పేరుతోపాటు ప్రాంతం, ఫొటో సా రాంశాన్ని స్పష్టంగా రాయాల్సి ఉంటుందని తెలిపారు. ఎంట్రీలను అగస్టు 5వ తేదీ లోపు ప్లాట్‌నంబర్ 103. బ్లాక్ నంబర్ 1, ప్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆదర్శనగర్ హైదరాబాద్29 చిరునామాకు సాఫ్ట్ కాపీలను tpja999 @gamail.com కు పంపించాలని సూచించారు.

ఆగస్టు 19న రవీంద్ర భారతిలో నిర్వహించనున్న ప్రపంచ ఫొటోగ్రపీ దినోత్సవం వేడుకలను అవార్డులను ప్రధాన చేయనున్నట్లు వెల్లడించారు. పోటీలో గెలుపొందిన ప్రథమ బహుమతికిగాను రూ. 10,000, ద్వితీయ బహుమతి రూ. 5000, తృ తీయ బహుమతి రూ.3000లతో పాటు 30 మంది రూ. 2000ల చోప్పున కన్పోలేషన్ బహుతులను ప్రదా నం చేయనున్నట్లు వారు తెలిపారు. రెండేళ్ల కు సంబంధించి ఈ ఏడాది మొత్తం 66 బహుమతులను అందజేయనున్నట్లు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భాస్కర్, చిన్న యాదగిరి గౌడ్‌లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News