Monday, December 23, 2024

అంగారక గ్రహంపై నదీ ప్రవాహ ఆనవాళ్లు

- Advertisement -
- Advertisement -

అంగారక గ్రహంపై నాసాకు చెందిన పెర్సెవరెన్స్ రోవర్ అనే వ్యోమనౌక కొత్తగా తీసిన ఛాయా చిత్రాలను పరిశీలిస్తే ఒకప్పుడు గ్రహంపై నది ప్రవహించేదని తెలుస్తోంది. శాస్త్రవేత్తలు గతంలో ఎన్నడూ చూడని సాక్షాధారాలకు భిన్నంగా ఈ నది చాలా లోతుగా వేగంగా ప్రవహించేదని తెలుస్తోంది. జెజెరో బిలం లోకి ప్రవహించే జలవనరుల్లో ఈ నది ఒక భాగమని చెప్పవచ్చు. రెండేళ్ల క్రితం రోవర్ ఎక్కడైతే గ్రహంపై కాలుమోపిందో అక్కడి ప్రాంతమే ఇదంతా. ఈ జలవనరుల పర్యావరణాన్ని అర్థం చేసుకోవడం ద్వారా శాస్త్రవేత్తలకు అంగారక శిలల్లో నిక్షిప్తమై ఉన్న ప్రాచీన సూక్ష్మ ప్రాణి మనుగడ సంకేతాలు తెలుసుకోడానికి సహాయమౌతుంది.

పెర్సెవరెన్స్ రోవర్ ఫ్యాన్ ఆకారంలో 820 అడుగుల ఎత్తులో ఉన్న అవక్షేపణ శిలల గుట్ట పైభాగాన్ని వెలుగు లోకి తెచ్చింది. వంపులు తిరిగిన పొరలు నీటి ప్రవాహంగా ప్రతిపాదిస్తున్నారు. ఆ నది ప్రవాహం ఏమాత్రం లోతు లేని ప్రవాహామా ? లేదా అత్యంత శక్తి వంతమైన నదీ వ్యవస్థా ? అన్నది తేలాల్సి ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నాసా క్యూరియాసిటీ రోవర్ గేల్ బిలం సాక్షాన్ని కనుగొన్న ప్రాంతానికి సమీపాన ఈ ప్రవాహ ఆనవాళ్లు ఇప్పుడు కనిపించాయి. ఈ ప్రవాహాలు చాలావరకు వ్యర్థాలను మోసుకెళ్లినట్టు అంచనా వేస్తున్నారు. పెద్ద పెద్ద వ్యర్థాల భాగాలనే ప్రవాహం మోసుకెళ్లి ఉండచచ్చని చెబుతున్నారు.

ఈ ప్రవాహ పొరలను ఇదివరకు అంతరిక్షంలో దూరం నుంచి చూడవచ్చు. కానీ ఇప్పుడు చాలా దగ్గరగా చూడగలుగుతున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రవాహ అవక్షేపాలే చివరకు శిలలుగా మారాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం శాస్త్రవేత్తలు జెజెరో బిలంలో వంపులు తిరిగిన రాతి పొరలను గమనించారు. అయితే అవి వంపులు తిరిగిన ఉపరితలం అని అనుకునే వారు. అంతరిక్షం నుంచి వాటిని చూడగలిగినా, ఇప్పుడు చాలా దగ్గరగా పెర్సెవరెన్స్ వల్ల చూసే అవకాశం కలిగిందని హర్షం వెలిబుచ్చుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News