Thursday, January 23, 2025

అక్రమంగా జంతువులను తరలిస్తున్న వాహనం పట్టివేత

- Advertisement -
- Advertisement -

బోధన్ : బోధన్ మండలం కండ్గావ్ చెక్‌పోస్ట్ సమీపంలో బోధన్ రూరల్ పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టారు. మహారాష్ట్ర నుంచి సుజుకి ఈకో (టిఎస్ 03 ఎఫ్ ఎ0787) వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఈ వాహనంలో 18 అడవి జంతువులు, ముళ్ళ పందులు ఉన్నాయి. వాహనంలో ఉన్న డ్రైవర్ మరో వ్యక్తిని , వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగులను పోలీసులు విచారించారు. పో లీసులు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండకు చెందిన దేవరాజుల జంపయ్య, శి వకృష్ణ అనే వ్యక్తులు ఈ అడవి జంతువులను బిలోలి ప్రాంతంలోని పాట అనే గ్రా మస్తులు ఉత్తమ్, ప్రకాష్ అనే వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి హన్మకొండలోని పలువురికి అడవి జంతవులను విక్రయించినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. తనిఖీలో అడవి జంతువులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న కానిస్టేబుల్ మైపాల్, హోంగార్డు విట్టల్‌ను ఎసిపి కిరణ్ కుమార్, సిఐ శ్రీనివాసరాజ్, ఎస్సై లోకం సందీప్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News