Thursday, April 3, 2025

గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టివేత

- Advertisement -
- Advertisement -

బోధన్ రూరల్ : బోధన్ మండలం కల్దుర్కి గ్రామం నుంచి చిన్నమావంది గ్రామం మీదుగా గోవులను సాటాపూర్ సంతకు తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. గోవులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న గ్రామ యువకులు బోధన్ హిందూవాహినిశాఖ వారికి సమాచారం అందించడంతో వారు చిన్నమావంది గ్రామానికి చేరుకుని గోవులను తరలిస్తున్న వాహనాఇ్న బోధన్‌కు తరలించారు. అనంతరం గోవులను శ్రీ ఏకచక్రేశ్వర గోశాలకు తరలించారు. వాహనాన్ని బోధన్ రూరల్ ఠానాకు తరలించి గోవులను తరలిస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గోమాతలను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వాహన డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించారు. ఈకార్యక్రమంలో హిందూ వాహని ప్రధాన కార్యదర్శి శేఖర్, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి కందికట్ల వాసు, భజరంగ్ దల్ రాజు, వాల్మీకి దీపక్, అర్జున్, గంగాధర్, బిజెపి నాయకులు ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News