Friday, November 15, 2024

ప్రమాద స్థలి వద్ద ట్రాకుల పునరుద్ధరణ పూర్తి: వందే భారత్ పయనం

- Advertisement -
- Advertisement -

బాలాసోర్: ఒడిశాలో గత శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాద ఘటన తర్వాత రైల్వే ట్రాక్ పునర్ధురణ అనంతరం సోమవారం ఉదయం హైరా నుంచి పూరీ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బాలాసోర్ మీదుగా ప్రయాణించింది. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బహనాగ బజార్ స్టేషన్ మీదుగా వెళ్లినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.

రెండు ట్రాకుల మీదుగా రైళ్ల రాకపోకలకు వీలుగా పునరుద్ధరణ పనులు పూర్తయినట్లు వారు చెప్పారు. వందే భారత్ రైలు వెళుతున్న సమయంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బహనాగ రైల్వే స్టేషన్‌లో నిలబడి డ్రైవర్లకు చేతులు ఊపి అభివాదం చేశారు. దీంతోపాటు హౌరా నుంచి పూరీ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌తోపాటు భువనేశ్వర్ నుంచి ఢిల్లీ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ కూడా సోమవారం తెల్లవారుజామున ఇదే మార్గంలో ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రికే రెండు లైన్లలో ట్రాకుల పునరుద్ధరణ పూర్తయినట్లు వైష్ణవ్ చెప్పారు.

ఇదిలా ఉండగా 275 మంది ప్రయాణికుల మరణానికి కారణమైన రైలు ప్రమాద ఘటనపై కమిషనర్ ఆఫ్ రైల్వే సెఫ్టీ(ఎస్‌ఇ సర్కిల్) శైలేష్ కుమార్ పాఠక్ విచారణ ప్రారంభించారు. సోమవారం ఆయన బహనాగ బజార్ స్టేషన్‌ను సందర్శించి ఘటనా స్థలిని పరిశీలించారు. కంట్రోల్ రూమును, సిగ్నల్ రూమును కూడా తనిఖీ చేసి స్టేషన్ మేనేజర్‌తో ఆయన మాట్లాడారు.

లూప్‌లైన్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశించి ఘోర దుర్ఘటనకు దారితీసినట్లు చెబుతున్న ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ను కూడా ఆయన పరిశీలించారు. తాము ఇప్పుడే విచారణ ప్రారంభించామని, పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందని పాఠక్ తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత ప్రమాదానికి దారితీసిన కచ్ఛితమైన కారణాలు నిర్ధారణ అవుతాయని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News