Friday, April 4, 2025

రాహుల్ గాంధీ సభకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కల్యాణపురం వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మణుగూరులోని జంగారం నుంచి దాదాపు 30 మందిట్రాక్టర్‌లో కాంగ్రెస అగ్రనేత రాహుల్ గాంధీ సభకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు సోడె వెంకటేశ్వర్లుగా గుర్తించారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News