Tuesday, January 21, 2025

ట్రాక్టర్, కారు ఢీ.. తల్లీ, కూతురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

కౌడిపల్లి: ముందుకు వెళ్తున్న ట్రాక్టర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న తల్లి కూతుర్లు దుర్మరణం చెందిన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గేటు సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంచనపల్లి గ్రామానికి చెందిన దుంపల మల్లేశం(40) వృత్తి విద్యుత్ లైన్‌మెన్ కాగా మల్లేశం సోమవారం సాయంత్రం భార్య స్వరూపతో కలిసి నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి శుభకార్యానికి వెళ్లి కార్యం ముగించుకుని సెలవుల్లో బంధువుల దగ్గరికి వెళ్లిన తన కూతురు అలేఖ్య బంధువుల అమ్మాయి లావణ్యతో కలిసి రాత్రి తిరిగి వస్తుండగా అంతారం

గేటు దాటిన కొద్ది దూరం తర్వాత షేరితండాకు చెందిన ట్రాక్టర్ వెళ్తున్న క్రమంలో డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న దుంపల మల్లేశం కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఘటన స్థలం వద్ద తల్లి స్వరూప(36), కూతురు అలేఖ్య(13) మృతిచెందగా మల్లేశం బంధువు లావణ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించి మృతిచెందిన వారిని నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. స్వరూప గ్రామంలో ఆశావర్కర్‌గా పనిచేస్తూ అందరితో కలుపుగోలుగా ఉండేదని తల్లి కూతురు మరణించడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.
అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన స్వరూప, శ్రీలేఖ అంత్యక్రియలు మంగళవారం కంచనపల్లిలో నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతాలకా్ష్మరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆవుల రాజిరెడ్డిలు హాజరయ్యారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా గాయపడిన మల్లేశం, లావణ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని అన్ని విధాల ఆదుకుంటామని భరోసా కల్పించారు. మృతుని తమ్ముడు దుంపల పరమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News